Tap to Read ➤

టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో కొత్త హీరోయిన్స్ హావ.. తడిపేస్తున్న కొత్త అందాల

టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో ప్రస్తుతం కొత్త హీరోయిన్స్ హావ నడుస్తోంది. కొత్త హీరోయిన్లు వరస సినిమాలు చేసుకుంటూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పాకులాడుతున్నారు.
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది కృతి శెట్టి. రెండో సినిమా శ్యామ్ సింగరాయ్ బంగార్రాజు కూడా బాగానే ఆడింది. దాంతో కృతి హాట్ టాపిక్ అయిపోయింది.
రొమాంటిక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది కేతిక శర్మ. ఈ సినిమాలో అమ్మడు అందాలకు అంతా ఫిదా అయిపోయారు. తాజాగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న రంగరంగ వైభవంగా సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయింది.
జాతి రత్నాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఫరియా. బంగార్రాజులో ఐటం సాంగ్ చేసి అదరహో అనిపించింది ఫరియా. ఇప్పుడు రవితేజ రావణాసుర సినిమాలో ఓ హీరోయిన్‌గా నటిస్తుంది ఫరియా.
అద్భుతం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది శివానీ. ఈ సినిమాలో నటనకు మంచి మార్కులు పడ్డాయి. WWW సినిమాతో కూడా వచ్చింది. ప్రస్తుతం తమిళ సినిమాలతో కూడా బిజీగా ఉంది శివానీ రాజశేఖర్.
పెళ్లి సందD సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది శ్రీలీల. ఈ సినిమాలో చిలిపి అందాలకు.. నటనకు అంతా ఫిదా అయిపోయారు.
ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది మీనాక్షి. రవితేజ ఖిలాడీలో ఈమె ఓ హీరోయిన్‌గా నటిస్తుంది.
రామ్ పోతినేని రెడ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది అమృత. శ్రీవిష్ణు అర్జున ఫల్గుణలో కూడా ఈమె హీరోయిన్‌గా కనిపించింది. ఇప్పుడు హనుమాన్‌లో అమృత నటిస్తుంది.
బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన దబంగ్ 3తో హీరోయిన్‌గా పరిచయమైంది. తెలుగులోనే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం అడవి శేష్ మేజర్ సినిమాతో పాటు వరుణ్ తేజ్ గని సినిమాలో నటిస్తుంది.
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా లైగర్ సినిమాలో నటిస్తుంది.
సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన సినిమా ఏక్ మినీ కథ లో కావ్య తప్పర్ హీరోయిన్‌గా పరిచయం అయింది. కావ్యకు ఇప్పుడు తెలుగులో బాగానే ఆఫర్స్ వస్తున్నాయి.
గద్దలకొండ గణేష్ సినిమాతో ప్రేక్షకుల దృష్టిలో పడిన కుర్ర హీరోయిన్ డింపుల్ హయతి. రవితేజ ఖిలాడీతో పాటు మరికొన్ని సినిమాలు చేస్తుంది డింపుల్.
మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ నేహా శెట్టి. ఆ తర్వాత గల్లీ రౌడీ లాంటి సినిమాలు చేసింది. డిజే టిల్లు సినిమాలో హీరోయిన్‌గా నటించింది