Tap to Read ➤

కృష్ణంరాజు కోసం ప్రభాస్ కోట్ల ఖర్చు: ఒక్క భోజనాలకే ఎంత పెట్టాడంటే!

ఇటీవల కన్నుమూసిన టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ కృష్ణంరాజు స్మారక కార్యక్రమం మొగల్తూరులో జరిగింది. దీనికోసం స్టార్ హీరో ప్రభాస్ ఎంత ఖర్చు చేశాడన్నది తెలుసుకుందాం పదండి!
Manoj Kumar
సీనియర్‌ నటుడు కృష్ణంరాజు స్మారక కార్యక్రమం ఆయన స్వస్థలమైన మొగల్తూరులో గురువారం జరిగింది
ఈ కార్యక్రమానికి కృష్ణంరాజు భార్య శ్యామల, ప్రభాస్‌, పిల్లలు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు
12 ఏళ్ల తర్వాత సొంత ఊరికి వచ్చిన ప్రభాస్‌కు, కుటుంబ సభ్యులకు స్ధానికులు ఘన స్వాగతం పలికారు
ప్రభాస్‌ను చూసేందుకు చుట్టుపక్కల నుంచి కొన్ని వేల మంది అభిమానులు మొగల్తూరుకు వచ్చారు
పేరుపాలెం దగ్గర కృష్ణంరాజు స్మృతివనం నిర్మిస్తామని ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి రోజా తెలిపారు
కృష్ణంరాజు స్మారక విందు కోసం ప్రభాస్ 50 రకాల వెజ్‌, నాన్‌‌వెజ్‌ వంటకాలను తయారు చేయించాడు
ఉదయం తొమ్మిది గంటల నుంచే మొదలైన భోజన కార్యక్రమానికి దాదాపు 50 వేల మందికి పైగా వచ్చారు
కృష్ణంరాజు స్మారక కార్యక్రమం, భోజనాల నిమిత్తమే ప్రభాస్ దాదాపు రూ 3 కోట్లు ఖర్చు చేశాడని తెలిసింది