Tap to Read ➤

హీరోయిన్‌ ప్రణీత బేబీ బంప్‌ ఫొటోలు వైరల్‌

హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌ సంతోషం అంతాఇంతా కాదు. తను ప్రెగ్నెంట్‌ అని తెలిసిన దగ్గర నుంచి అమ్మ అని పిలిపించుకోవడానికి ఎంతగానో తహతహలాడుతోంది. తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో బేబీ బంప్‌ ఫొటోలు షేర్‌ చేసింది.
ప్రణీత ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది.
బావ మూవీతో గుర్తింపు సంపాదించుకుంది. అత్తారింటికి దారేది చిత్రంతో బాపుబొమ్మగా మరింత క్రేజ్‌ తెచ్చుకుంది.
ఎన్టీఆర్ కి జంటగా రామయ్యా వస్తావయ్యా చిత్రం చేశారు. అయితే ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు.
తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకోలేకపోయిన ప్రణీత అడపాదడపా చిత్రాలు చేశారు.
ప్రస్తుతం ఆమె హిందీలో చిత్రాలు చేస్తున్నారు. ప్రణీత హీరోయిన్ గా నటించిన హంగామా 2, బుజ్ చిత్రాలు విడుదలయ్యాయి.
ప్రణీత 2021 మే 30న వ్యాపారవేత్త నితిన్‌ రాజును పెళ్లాడింది.
తన భర్తతో కూడిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.