Tap to Read ➤

ప్రియాంక అరుల్ మోహన్ అదిరిపోయే ఫోటోస్

నాని, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'గ్యాంగ్ లీడర్' తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన ప్రియాంక అరుల్ మోహన్‌ ఆకర్షణీయమైన రూపంతో కుర్రాళ్ల మనుసును కొల్లగొట్టింది.
1994 నవంబర్ 20న జన్మించిన ఈ భామ కన్నడ తల్లికి తమిళ తండ్రికి తమిళనాడులోని మద్రాసులో పుట్టి పెరిగింది.
పెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (PESIT)లో బయో టెక్నాలజీలో ఇంజినీరింగ్‌లో డిగ్రీని పూర్తి చేసింది.
నాని ‘గ్యాంగ్ లీడర్’ మూవీతో పరిచయమైన ప్రియాంక అరుల్ మోహన్ ముందుగా కన్నడ సినిమా ‘ఒద్ కథ హెల్ల’ మూవీతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.
ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. దీంతో తన దృష్టిని మిగిలిన దక్షిణాది భాషలపై పెట్టింది.
త‌మిళంలో మంచి అవ‌కాశాలే వ‌స్తున్న‌ప్ప‌టికీ, తెలుగులో మాత్రం ప్రియాంక అరుల్ మోహ‌న్‌కు హీరోయిన్‌గా అవ‌కాశాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి.
శివ కార్తీకేయన్ హీరోగా నటించిన ‘వరుణ్ డాక్టర్’ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అంతేకాదు ఫస్ట్ మూవీతోనే అక్కడ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.
సూర్య హీరోగా నటించిన ‘ET’ ఎవరికీ తలవంచడు’ సినిమాతో పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది