Tap to Read ➤

ఉప్పెన దర్శకుడితో రామ్ చరణ్ కొత్త సినిమా

రామ్ చరణ్ కొత్త సినిమాకు సుకుమార్ శిష్యుడు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. అధికారిక ప్రకటన విడుదల చేసారు
Ram reddy
రామ్‌ చరణ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌తో కలిసి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తోన్నసంగతి తెలిసిందే.
RC15 లో కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తున్నారు. కొన్నాళ్లు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన టీమ్ ఇక షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది.
RC15 లో రామ్ చరణ్ డ్యుయల్ రోల్‌.. ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా కనిపంచనుండగా.. మరో పాత్రలో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తారని తెలుస్తోంది.
రామ్ చరణ్ 16 సినిమాను యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో చేయనున్నారు.
ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రానుంది.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.