Tap to Read ➤

రవితేజ ధమాకా సంచలన రికార్డు.. మహేశ్‌ను దాటేసి.. కేజీఎఫ్‌తో సమానంగా!

రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రమే ‘ధమాకా’. ఈ సినిమా భారీ వసూళ్లతో సత్తా చాటుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యం ఓ రికార్డు సాధించింది. అదేంటో చూడండి!
Pichuka Manoj Kumar
మాస్ మహారాజా రవితేజ కొద్ది రోజుల క్రితమే ‘ధమాకా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు
‘ధమాకా’కు పాజిటివ్ టాక్ రావడంతో పాటు ప్రేక్షకుల స్పందనతో భారీ కలెక్షన్లు వస్తున్నాయి
‘ధమాకా’ ఆంధ్రా, తెలంగాణలో కలిపి వరుసగా 12 రోజులు కోటి కంటే ఎక్కువ షేర్ రాబట్టింది
2022లో 12 రోజులు రూ. కోటి షేర్ రాబట్టిన చిత్రాల జాబితాలో కేజీఎఫ్ 2తో సమానంగా నిలిచింది
2022లో ఏకంగా 17 రోజులు కోటి కంటే ఎక్కువ షేర్ రాబట్టి RRR టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది
మహేశ్ నటించిన సర్కారు వారి పాట మూవీ 2022లో 11 రోజులు కోటి కంటే ఎక్కువ షేర్ రాబట్టింది
నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ‘కార్తికేయ 2’ కూడా ఏకంగా 11 రోజులు ఈ మార్కును దాటి సత్తా చాటింది
ఆంధ్రా, తెలంగాణలో ఎక్కువ రోజులు కోటి రాబట్టిన చిత్రాల్లో బాహుబలి 2 (28 రోజులు) ముందుంది