Tap to Read ➤

పునీత్ రాజ్‌కుమార్ ‘జేమ్స్’ మూవీ చూడటానిగలా కారణాలు

పవర్ స్టార్ పునీత్ హీరోగా ఈయన నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’.ఈ సినిమా దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. పునీత్ జయంతి సందర్భంగా మార్చ్ 17న ఈ రోజు ఈ చిత్రాన్ని విడుదల చేసారు.
పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం కావడంతో సినీ పరిశ్రమలో 'జేమ్స్' మూవీ ప్రత్యేకతను సంతరించుకుంది.
కన్నడనాట 500 పైగా స్క్రీన్స్.. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250కి పైగా స్క్రీన్స్‌ ప్రపంచ వ్యాప్తంగా 4 వేలకు పైగా స్క్రీన్స్‌లో ఈ సినిమాను విడుదల చేశారు.
తెలుగు హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా నటించారు. పునీత్ రాజ్‌కుమార్ సరసన ప్రియా ఆనంద్ నటించారు.
స్టోరి
ఈ చిత్రంలో పునీత్‌కు వాళ్ల అన్నయ్య శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పడం విశేషం.
ఈరోజు దివంగత నటుడు జయంతి కావడంతో కన్నడ ఉన్న అన్ని థియేటర్స్‌లో పునీత్‌కు నివాళిగా ఈ సినిమానే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్స్ నిర్ణయించారు.
'జేమ్స్' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం పునీత్ రాజ్‌కుమార్ మాస్ ఇంట్రో సీన్‌తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్‌తో యాక్షన్ ప్యాక్‌లా సాగిపోతుందట. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్‌గా ఉంటుందట.
అలాగే, సెకెండాఫ్ కూడా అదే రితిలో ఉంటూ కొన్ని భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలతో సాగుతుందట. క్లైమాక్స్ కూడా ఆకట్టుకునేలా డిజైన్ చేశారని టాక్.