Tap to Read ➤

సర్కారు వారి పాట ట్రైలర్.. మహేష్ బాబు చెప్పిన డైలాగులు వేరే లెవెల్..!

సర్కారు వారి పాట ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ నేపథ్యంలో ట్రైలార్‌ లాంచ్‌ ఈవెంట్‌ను కూకటపల్లిలోని భ్రమరాంబ థియేటర్లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో మహేష్ బాబు చెప్పిన డైలాగులు అదిరిపోయాయి.
సినిమా మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.
ఈ ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరోసారి మహేష్ బాబు బాక్సాఫీస్ దగ్గర మాయ చేయడం పక్కా అని చెబుతున్నారు.
విడుదలకు 15 రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ అవడం మాములు విషయం కాదు.
ట్రైలర్ లో మహేష్ బాబు చెప్పిన డైలాగులు అదిరిపోయాయి.
నా ప్రేమను దొంగలించగలవు, నా స్నేహాన్ని దొంగలించగలవు కానీ నా డబ్బులు దొంగలించ లేవు అన్న మహేష్ బాబు డైలాగులు బాగున్నాయి.
నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ ఏపీ సీఎం జగన్ చెప్పిన డైలాగులు చెప్పడం అదిరిపోయింది.
ముఖ్యంగా మ్యారేజ్ చేసుకునే వయసొచ్చిందటావా.. ఊరుకోండి సార్.. మీకు పెళ్లేంటి... చిన్న పిల్లాడివైతేను. అందరు నీలాగే అనుకుంటున్నారు. ఇక్కడ దూల తీరిపోతాంది
ఓ వంద వయాగ్రాలు వేసి శోభనం కోసం వెయిట్ చేస్తోన్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు అనే డైలాగు పేలింది.