Tap to Read ➤

సర్కారు వారి పాట 5రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘సర్కారు వారి పాట’ మే 12న సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. వ‌రుస విజ‌యాలు సాధించిన మ‌హేష్ త‌న కెరీర్‌లో మ‌రో స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు.
క‌లెక్ష‌న్స్ విష‌యంలో మ‌హేష్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా చాటాడు.
ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు రోజుల‌కు క‌లిపి రూ.100 కోట్లు షేర్ సాధించటం విశేషం.
నైజాం - రూ. 31.47 కోట్లు, సీడెడ్ - రూ.10.44కోట్లు, ఉత్త‌రాంధ్ర - రూ.10.25కోట్లు, ఈస్ట్ - రూ. 7.05కోట్లు
వెస్ట్ - రూ. 4.65 కోట్లు, గుంటూరు - రూ. 7.85 కోట్లు, కృష్ణా - రూ. 5.76 కోట్లు, నెల్లూరు - రూ.3.12కోట్లు
మొత్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లోనే ఐదు రోజుల‌కు క‌లిపి షేర్ క‌లెక్ష‌న్స్‌ రూ.80.59 కోట్లుగా ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.
క‌ర్ణాట‌క మ‌రియు రెస్టాఫ్ ఇండియా క‌లిపి చూస్తే రూ. 7.75కోట్లు షేర్ రాగా.. ఓవ‌ర్ సీస్‌లో రూ.12.10కోట్లు వ‌చ్చాయి.
ఐదు రోజుల‌కు క‌లిపి రూ. 100.44 కోట్లు షేర్ వ‌సూళ్లు వ‌చ్చాయి. గ్రాస్ వ‌సూళ్ల ప్ర‌కారం ఇది రూ.160.20 కోట్ల మార్కును ట‌చ్ చేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.