Tap to Read ➤

సీతారామం మూవీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ఆసక్తికర విషయాలు!

మొదటి సినిమాకే సూపర్ క్రేజ్ దక్కించుకునే హీరోయిన్స్ అరుదుగా వస్తుంటారు. ‘సీతారామం’ సినిమాతో తెలుగులో డెబ్యూ చేసిన మృణాల్ ఠాకూర్.. ఆ కోవకే చెందుతుందని చెప్పాలి. ఎవరీ మృణాల్ ఠాకూర్? అసలు ఆమె సినీ ప్రస్థానం ఎలా మొదలైంది? అనే అంశాలపై.
Ram reddy
మహారాష్ట్రలోని ధూలే ఏరియాలో పుట్టిన మృణాల్ ఠాకూర్.. ముంబైలోనే తన స్కూలింగ్, కాలేజీ పూర్తిచేసింది.
మాస్ మీడియాలో కోర్స్ చేసిన మృణాల్.. 2012లో ‘ముజ్ సే కుచ్ కెహెతి.. యే కామోషీయన్’ అనే టీవీ సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించింది.
2014లో ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్ తో మంచి గుర్తింపు దక్కించుకుని, తన మొదటి సినిమా వట్టిదండు(మరాఠీ)తో సినీ నటిగా అరంగేట్రం చేసింది.
2018లో ‘లవ్ సోనియా’ అనే సినిమాతో బాలీవుడ్ లో డెబ్యూ చేసింది మృణాల్.
హిందీలో పలువురు స్టార్ హీరోలతో నటించినా కూడా మృణాల్‌కు వెంటవెంటనే ఆఫర్లు మాత్రం రాలేదు..
తెలుగులో ‘సీతారామం’ సినిమాలో అవకాశం అందుకొని, సీత పాత్రలో తన నటనతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
తెలుగుతో పాటు తమిళ, మలయాళం భాషలలో విడుదలైన ఈ సీతారామం మూవీ.. అన్నిచోట్లా ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.