Tap to Read ➤

బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న తెలుగు మూవీస్..ఒకటి కాదు రెండు ఏకంగా.!

సౌత్ హీరోలే కాదు.. సౌత్ కథలంటే కూడా ఫుల్ గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. మాస్ ను మెప్పించే ఇక్కడి సినిమాలంటే నార్త్ ఆడియెన్స్ కళ్లప్పగిస్తున్నారు. ఒకటి కాదు రెండు ఏకంగా 20 పైగా సినిమాలను రీమేక్ చేస్తున్నారు
ప్రభాస్, రాజమౌళి ఛత్రపతిని హిందీలో రీమేడ్ చేస్తున్నారు. అయితే ఇందులో స్పెషల్ ఏంటంటే.. బెల్లంకొండ శ్రీనినాస్ హీరో కాగా.. వివి వినాయక్ డైరెక్షన్ చేస్తున్నారు.
2005లో తెలుగు తమిళ భాషల్లో సంచలనం సృష్టించిన చిత్రం అన్నియన్ (అపరిచితుడు). ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు.
బన్నీ నటించిన క్రేజీ బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములో కూడా రీమేక్ అవుతోంది. షెమజాదా పేరుతో రీమేక్
విశ్వక్ సేన్ నటించిన ఇంటెన్స్ కాప్ డ్రామా హిట్. ఈ చిత్రాన్ని రూపొందించిన శైలేష్ కొలను హిందీ రీమేక్ ని డైరెక్ట్ చేస్తున్నాడు.
కార్తి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఖైదీ కూడా రీమేక్ అవుతోంది. ఇందులో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు.
సూర్య సూపర్ హిట్ ఆకాశమే నీ హద్దురా సినిమా త్వరలోనే బాలీవుడ్ సెట్స్ పైకెళ్లనుంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించబోతున్నాడు.
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేశ్ ను ఆధారంగా చేసుకొని రాబోతుంది. బచ్చన్ పాండే హీరోగా నటించబోతున్నాడు.
అక్షయ్ కుమార్ చేతిలో బెల్లంకొండ రాక్షసుడు రీమేక్ మిషన్ సిండ్రెల్లా కూడా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో లేడీ లీడ్ గా కనిపించబోతుంది.