Tap to Read ➤

కన్నడ బ్యూటీ శ్రీలీల టాలీవుడ్‌లో చేస్తున్న మూవీస్ లిస్ట్

పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ శ్రీలీల. తన అందచందాలతో, డాన్స్ తో, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. వరుస ఆఫర్లతో 6 సినిమాలకు పైగా ప్రస్తుతం చేస్తోంది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.
నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కబోయే అనగనగా ఒక రాజు ఆ సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్ గా కన్ఫామ్ అయ్యింది.
నితిన్ , వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో శ్రీ లీల ఇప్పటికే హీరోయిన్ గా కన్ఫామ్ అయ్యింది.
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కబోయే మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీలో కూడా శ్రీ లీల హీరోయిన్ గా నటించబోతోంది.
బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో శ్రీ లీల బాలకృష్ణ కూతురుగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
వారాహి చలన చిత్రం తెలుగు మరియు కన్నడ భాషలలో తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్ కన్ఫామ్ అయ్యింది.
వరుస సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ శ్రీ లీల ముందుకు దూసుకుపోతుంది.