Tap to Read ➤

SVP Twitter Review: 'సర్కారు వారి పాట' ట్విట్టర్ రివ్యూ

ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు 'సర్కారు వారి పాట' ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాపై ఓవర్‌సీస్ ఆడియెన్స్ తమ రివ్యూలను ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా ప్రేక్షకుల ముందుకు రానే వచ్చేసింది.
దాదాపు రెండేళ్ల తర్వాత వచ్చిన మహేష్ బొమ్మ ప్రేక్షకులను ఎంత మేర మెప్పించిందో ఇప్పుడు 'ట్విట్టర్' రివ్యూలో చూద్దాం..
'మహేష్ వన్ మ్యాన్ షో. సూపర్ స్టార్ ఎప్పుడూ ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్ చేయరు. ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది. ఎక్కడా బోర్ కొట్టదు...' అంటూ ఓ లేడీ ఫ్యాన్ ఇలా తన రివ్యూని షేర్ చేశారు
'సినిమా డీసెంట్ ఎంటర్టైనర్. ప్రేక్షకులకు మాస్ జాతరే. మహేష్ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. కీర్తి సురేష్ చాలా అందంగా కనిపించింది, బాగా నటించింది.
పాటలు, బీజీఎం మతి పోగొట్టేలా ఉన్నాయి. సినిమాకు రేటింగ్ 3.5.' అని మరో నెటిజన్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
'ఒక పోకిరి పండు గాడు... ఒక దూకుడు అజయ్... ఒక ఖలేజా సీతారామ రాజు.. ఒక సూర్యాభాయ్... అలాగే ఒక సర్కారు వారి పాట మహేష్.... గుర్తుండిపోయే పెర్ఫామెన్స్. అంటూ మహేష్ ఫ్యాన్ ఒకరు తన ట్వీట్‌లో చెప్పుకొచ్చాడు.
మహేష్ బెస్ట్ పెర్ఫామెన్స్ కనబర్చిన సినిమా. ముఖ్యంగా కామెడీ సీన్స్‌లో. ఫస్టాఫ్‌తో పాటు ఫైట్స్‌లోనూ ఆ బీజీఎం ఉంటే బాగుండు అనిపించింది.' అంటూ ఓ నెటిజన్ తన ఒపీనియన్‌ని షేర్ చేశాడు.