Tap to Read ➤

ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న మూవీస్

చిన్న, మీడియం బడ్జెట్ మూవీస్‌ తక్కువ రేటుకే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసాయి. హిట్ టాక్ వస్తే ఈ మూవీస్‌ వీకెండ్‌ వరకే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నాయి. ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నమూవీస్ లిస్ట్
మేజర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 18 కోట్లకు అమ్ముడుపోయింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 27.76 కోట్ల షేర్ ( రూ. 50.30 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. ఓవరాల్‌గా రూ.9 కోట్ల వరకు లాభాలను తీసుకొచ్చింది.
విక్రమ్ తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్ల షేర్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ మూవీ నాల్గు రోజుల్లో రూ. 7.50 కోట్లను రాబట్టి హిట్ స్టేటస్ అందుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా తెలుగులో రూ. 12.53 కోట్ల షేర్ రాబట్టింది.
డిజే టిల్లు రూ. 9 కోట్ల బడ్జెట్‌తో బరితో దిగిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 9.2 కోట్ల షేర్ రాబట్టి హిట్‌గా నిలిచింది. 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఫిబ్రవరిలో మొదటి హిట్‌గా నిలిచింది.
జాతి రత్నాలు రూ. 10.08 కోట్ల టార్గెట్ బ్రేక్ ఈవెన్‌తో బరితో దిగిన ఈ సినిమా వీకెండ్ ముగిసే వరకు రూ 14 కోట్ల షేర్ రాబట్టి సూపర్ హిట్ లిస్టులో చేరింది.
ఉప్పెన రూ. 20 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ సినిమా వీకెండ్ ముగిసేవరకు రూ. 25 కోట్ల రాబట్టి హిట్ లిస్టులో చేరింది.
మాస్టర్ తెలుగులో రూ. 8 కోట్ల టార్గెట్‌తో బరిలో దిగి వీకెండ్ ముగిసే వరకు రూ. 10 కోట్ల షేర్ రాబట్టి హిట్ లిస్టులో చేరింది.
టాక్సీవాలా రూ. 7 కోట్ల టార్గెట్‌తో బరిలో దిగిన ఈ మూవీ వీకెండ్ ముగిసే వరకు రూ. 9 కోట్ల షేర్ రాబట్టి హిట్ అనిపించుకుంది.
గీత గోవిందం రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా వీకెండ్ ముగిసే సమయానికీ రూ. 20 కోట్ల షేర్ రాబట్టి లాభాల్లోకి వచ్చింది.
అర్జున్ రెడ్డి రూ. 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా వీకెండ్ ముగిసే సమయానికీ రూ. 11 కోట్లు రాబట్టి లాభాల్లోకి వచ్చింది.