Tap to Read ➤

తెలుగు టాప్ యాంకర్స్ రెమ్యునరేషన్స్..!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ తర్వాత యాంక‌ర్లు, టీవీ నటీమణులు బాగానే సందపాదిస్తున్నారు. వాళ్లు తీసుకునే రెమ్యునరేషన్ తెలిస్తే నోరెల్ల బెట్టాల్సిందే.
తెలుగు ఇండ‌స్ట్రీలో నెం 1 యాంక‌ర్ సుమ..క్కో ఆడియో ఫంక్ష‌న్‌కు దాదాపు రూ. 2 నుంచి రూ. 2.5 ల‌క్ష‌ల వ‌ర‌కు సుమ వ‌సూలు చేస్తుంద‌నిది టాక్.
జబర్దస్త్ యాంకర్ అనసూయ సంపాదలో రెండో ప్లేస్‌లో ఉంది. ఒక్కో ఈవెంట్‌కు దాదాపు రూ. 2 ల‌క్ష‌లు ఛార్జ్ చేస్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.
జ‌బ‌ర్ద‌స్థ్ యాంకర్ ర‌ష్మీ గౌత‌మ్‌కు కూడా క్రేజ్ బాగానే ఉంది. ఈవెంట్స్‌కు తోడు ఓపెనింగ్స్‌తోనూ సంద‌డి చేస్తుంటుంది ర‌ష్మి. ఈ భామ రెమ్యున‌రేష‌న్ దాదాపు రూ. ల‌క్ష‌న్న‌రపైనే ఉంది.
బిగ్ బాస్ తర్వాత శ్రీముఖి రేంజ్ కూడా బాగానే పెరిగిపోయింది. ఈమె ఒక్కో ఈవెంట్‌కు దాదాపు రూ. లక్ష వరకు ఛార్జ్ చేస్తోంది.
రాఖీ సినిమాలో ఎన్టీఆర్ చెల్లిగా న‌టించిన మంజూష కూడా ఒక్కో ఈవెంట్‌కు రూ. 50 వేల వ‌ర‌కు వ‌సూలు చేస్తుంద‌నేది ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న వార్త‌.
యాంకర్ శ్యామల కూడా తన రేంజ్‌లో ఒక్కో ప్రోగ్రామ్‌కు రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం.
యాంకర్ ప్రశాంతి తన రేంజ్‌లో ఓ మోస్తరుగా ఛార్జ్ చేస్తోంది. ఈమెకు ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 15 వేలకు ఛార్జ్ చేస్తుందనేది టాక్.
నవ్యస్వామి ఒక్కో ఎసిసోడ్ దాదాపు రూ. 20 వేలు ఛార్జ్ చేస్తోంది. ఈమెకు గ్లామర్‌కు సినీ ఇండస్ట్రీ వాళ్లు కూడా ఫిదా అవుతున్నారు.