Tap to Read ➤

ఆగ‌స్ట్ నెలలో రిలీజ్ కానున్న తెలుగు సినిమాలు ఏవంటే...!

విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్' నితిన్, నిఖిల్ తో పాటు పలువురు స్టార్స్ ఆగస్ట్ నెలలో ప్రేక్షకలు ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆగస్ట్ లో రిలీజ్ కానున్న తెలుగు సినిమాలు ఏవంటే...
Ram reddy
క‌ల్యాణ్‌రామ్, సంయుక్త మీన‌న్‌, కేథ‌రిన్ తదితరులు నటించిన బింబిసార చిత్రం ఆగ‌స్ట్ 5న రిలీజ్ కానుంది.
దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్ జంట‌గా పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన చిత్రం సీతారామం. చిత్రం ఆగ‌స్ట్ 5న రిలీజ్ కానుంది.
నితిన్ హీరోగా న‌టించిన మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమా ఆగ‌స్ట్ 12న రిలీజ్ కానుంది.
నితిన్ తో పోటీగా ఆగ‌స్ట్ 12న నిఖిల్ కార్తికేయ -2తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.
ఆదిసాయికుమార్, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా న‌టించిన తీస్‌మార్‌ఖాన్ సినిమా ఆగ‌స్ట్ 19న రిలీజ్ కానుంది.
తేజ‌స్వి మ‌దివాడ‌, అన్వేషిజైన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన క‌మిట్‌మెంట్ సినిమా ఆగ‌స్ట్ 19న ప్రేక్ష‌క‌లు ముందుకు రానుంది.
లైగర్ సినిమా తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, కన్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఆగ‌స్ట్ 25న ఈ సినిమా రిలీజ్ కానుంది.
అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో శివ‌కార్తికేయ‌న్ హీరోగా న‌టిస్తున్న ద్విభాషా చిత్రం ప్రిన్స్‌. ఈ చిత్రం ఆగ‌స్ట్ 31న రిలీజ్ కానుంది.