Tap to Read ➤

టాలీవుడ్‌లో సత్తా చాటుతున్న మలయాళీ ముద్దుగుమ్మలు

గతకొంత కాలంగా ముంబై, ఢిల్లీ భామలు, మోడల్స్ కంటే మలయాళ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీకొచ్చి సత్తా చాటుతున్న బ్యూటీస్ ఎక్కువగా ఉన్నారు. చాలెంజింగ్ రోల్స్ చేయడంలో ప్రత్యేకత చూపడంలో మలయాళీ భామల తర్వాతే ఇంకెవరైనా అని చెప్పక తప్పదు.
Ram reddy
సాయి పల్లవి ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో బాగా పాపులర్ కావడంతో తెలుగులో ఫిదా సినిమాలో అవకాశం అందుకొని టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఫిదా, ఎం సి ఏ, పడి పడి లేచె మనసు, లవ్ స్టోరి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారింది.
నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై నేను లోకల్, మహానటి, అజ్ఞాతవాసి, లాంటి సినిమాలతో ఇక్కడ బాగా గుర్తింపు తెచ్చుకుంది. భోళా శంకర్, సర్కారు వారి పాట, దసరా సినిమాలు చేస్తోంది కీర్తి.
నిత్యా మీనన్ అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, సన్నాఫ్ సత్య మూర్తి, భీమ్లా నాయక్ లాంటి సినిమాలు నిత్యాకు క్రేజ్‌ను తీసుకొచ్చాయి.
సంయుక్త మీనన్: మలయాళంలో గ్లామర్ బ్యూటీగా మంచి క్రేజ్ ఉన్న ఈ బ్యూటీని త్రివిక్రమ్ శ్రీనివాస్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేశాడు.
అమల పాల్ రామ్ చరణ్ తేజసరసన నాయక్ సినిమాతో మంచి విజయం అందుకుంది. ఆమె కమర్షియల్ హిట్స్ లవ్ ఫెయిల్యూర్, అల్లు అర్జున్ సరసన ఇద్దరామ్మాయిలాతో అనే సినిమాలో నటించింది.
అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్, ఆ ఆ, ఉన్నది ఒకటే జిందగీ, శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసమే, కార్తికేయ 2 వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించారు.
నివేదా థామస్