Tap to Read ➤

ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో ప్రజల ముందుకు వస్తున్న సినిమాలివే.

ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో సందడి చేయడానికి కొన్ని సినిమాలు రాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. స్ట్రయిట్ తెలుగు సినిమాలు ఏవీ ఈ వారం థియేటర్లలోకి రావడం లేదు
ఏప్రిల్ 13న 'బీస్ట్'తో తమిళ హీరో విజయ్ థియేటర్లలోకి వస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా సినిమాపై ఆసక్తి నెలకొంది.
ఏప్రిల్ 14న 'కె.జి.యఫ్ 2' సెకండ్ చాప్టర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. గురువారం ఈ సినిమా విడుదల కానుంది.
ఆడవాళ్ళు మీకు జోహార్లు సోనీ లివ్ ఓటీటీలో ఏప్రిల్ 14న విడుదల కానుంది.
పునీత్ రాజ్ కుమార్ ఆఖరి సినిమా 'జేమ్స్' కూడా సోనీ లివ్ ఏప్రిల్ 14న ఓటీటీలో విడుదల కానుంది.
రామ్ గోపాల్ వర్మ 'దహనం' ఫ్యాక్షనిజం, నక్సలిజం మేళవించి పగ, ప్రతీకారం నేపథ్యంలో తీసినట్టు ఉన్నారు. ఇదీ ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమైంది.
సాయికుమార్, రాధిక నటించిన 'గాలివాన' క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఓ జంటను ఎవరు హత్య చేశారనే మిస్టరీ. బిబిసి స్టూడియోస్‌, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో 'జీ 5' ఓటీటీ సంస్థ నిర్మించింది.
బ్లడీ మేరీ నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బ్లడీ మేరీ'. ఆహా ఓటీటీ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. ఈ నెల 15న విడుదలవుతోంది.