Tap to Read ➤

ఈ వారం ధియేటర్, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలివే

వేసవి ఎంటర్‌టైన్‌మెంట్ మస్త్‌గా ఇచ్చేందుకు ధియేటర్లతో పాటు ఓటీటీలు సిద్ధమయ్యాయి. ఈ వారమంతా ధియేటర్, ఓటీటీల్లో భారీగా సరికొత్త సినిమాలు విడుదల కానున్నాయి.
రాజశేఖర్ ప్రధానపాత్రలో జీవిత దర్శకత్వంలో తెరకెక్కిన శేఖర్ చిత్రం మే 20 న ధియేటర్లలో విడుదల కానుంది.
సోనాక్షి, సంపూర్ణేష్ బాబు జంటగా ధగడ్ సాంబ్ సినిమా కూడా మే 20 విడుదలవుతోంది.
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన థాకడ్ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా మే 20 విడుదలవుతోంది.
హారర్ కామెడీ చిత్రం భూల్ భులయ్యా 2. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న సినిమా మే 20న విడుదలవుతోంది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన రాజమౌళి తెరకెక్కించిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ మే 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన కొరటాల శివ దర్శకత్వంలోని ఆచార్య అమెజాన్ ప్రైమ్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
యువ నటుడు శ్రీవిష్ణు నటించిన భళా తందనాన చిత్రం మే 20న డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.