Tap to Read ➤

టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరో హీరోయిన్లు ఎవరో తెలుసా..?

ఓర్మాక్స్‌ మీడియా అనే ప్రముఖ కన్సల్టింగ్‌ సంస్థ వివిధ సినిమా పరిశ్రమల్లో మోస్ట్ పాపులర్ నటులు ఎవరనే విషయంపై తరచూ సర్వే నిర్వహిస్తుంటుంది. ఇందులో టాలీవుడ్ పరిశ్రమలో టాప్ హీరో, హీరోయిన్లు ఎవరనే విషయంలో టాప్ 10 జాబితా ప్రకటించింది.
టాలీవుడ్ సినిమాలో అగ్రనటులు, నటీమణులు చాలామంది ఉన్నారు. మరి వీరందరిలో ఎవరు టాప్ అంటే సమాధానం లేదు. కానీ ఆ ప్రతిష్ఠాత్మక సంస్థ సర్వే మాత్రం ఎవరు టాప్ అనేది తేల్చింది.
మోస్ట్ పాపులర్ టాప్ 10 జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ అగ్రస్థానంలో ఉన్నాడు
ఎన్టీఆర్‌ తర్వాత ప్రభాస్‌, అల్లు అర్జున్‌, రామ్ చరణ్‌, మహేశ్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌, నాని, విజయ్‌ దేవరకొండ, చిరంజీవి, రవితేజ ఉన్నారు.
హీరోయిన్ల విషయానికొస్తే సమంత మొదటి స్థానంలో నిలిచింది.
సమంత తరువాతి స్థానంలో..కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్నా, తమన్నా, కీర్తి సురేష్, సాయి పల్లవి, రకుల్ ప్రీత్‌సింగ్, రాశి ఖన్నాలు తరువాతి స్థానాల్లో నిలిచారు.
మెగాస్టార్ చిరంజీవి 9వ స్థానంలో, పవన్ కళ్యాణ్ 7వ స్థానంలో ఉండటం గమనార్హం.
సమంత తెలుగులో టాప్‌లో నిలిస్తే..తమిళంలో రెండవ స్థానంలో ఉండటం విశేషం.