Tap to Read ➤

తొలి సినిమాతోనే ఓవర్‌నైట్‌ స్టార్‌డం పొందిన హీరోయున్లు

మొదటి సినిమాతోనే కొందరు కనుమరుగైతే, మరొకందరు మాత్రం ఓవర్‌ నైట్‌ స్టార్‌ హీరోయిన్లుగా మారుతున్నారు. నటన, అందం సహా అదృష్టం కూడా కలిసొచ్చి మొదటి సినిమాతోనే స్టార్‌డంను సందించుకుంటున్నారు.
మొదటి సినిమా ఉప్పెనతో బంపర్‌ హిట్‌ అందుకున్న ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయిపోయింది.
ఛలో సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌ రష్మిక మందన్నా. ఈ సినిమా హిట్‌ కావడంతో ఈ అమ్మడికి స్టార్స్‌తో జతకట్టే అవకాశాలు వచ్చాయి.
ఆర్‌ఎక్స్‌100 సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టిన హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌. వచ్చీ రావడమే సూపర్‌ హిట్‌ అందుకొని విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
సమంత ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సూపర్‌హిట్‌ అందుకొని స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది.
అర్జున్‌రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌ డం సందించుకున్న హీరో-హీరోయిన్లు విజయ్‌ దేవరకొండ, షాలినీ పాండే.
నితిన్‌ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమా జయం. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది సదా. ఈ మూవీ ఎంత పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు.
అ‍ల్లు అర్జున్‌-పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం దేశముదురు. ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన భామ హన్సిక. డెబ్యూ మూవీతోనే స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది హన్సిక
ఉదయ్‌కిరణ్‌, రీమా సేన్‌ చిత్రం మూవీతో జంటగా నటించారు. ఈ సినిమా అప్పట్లోనే ఎంత పెద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు. తొలి సినిమాతోనే రీమాసేన్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిపోయిది.