Tap to Read ➤

టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల రెమ్యూనరేషన్‌

తెలుగు ఇండ‌స్ట్రీలో స‌రిగ్గా లెక్క‌పెడితే అర‌డ‌జ‌న్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. బాలీవుడ్ హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో మ‌న ద‌గ్గ‌ర కూడా ముద్దుగుమ్మ‌లు రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నారు.
సూపర్‌ స్టార్‌ నయనతార ఒక్కో సినిమాకు సుమారు 3 నుంచి 7 కోట్ల వ‌ర‌కు పారితోషికం అందుకుంటుంది.
పాన్‌ ఇండియా హీరోయిన్‌ పూజా హెగ్డే కూడా భారీగా రెమ్యూనరేషన్‌ అందుకుంటోంది. ఈ పొడుగుకాళ్ల సుందరి సినిమాకు 3 కోట్లు నుండి 4 కోట్లు తీసుకుంటోందట.
నేషనల్‌ క్రష్‌గా రష్మిక మందన కూడా పెద్ద మొత్తంలోనే అందుకుంటోంది. తెలుగు, తమిళం, హిందీలో నటిస్తున్న రష్మికకు ఒక్కో సినిమాకు 2.5 కోట్ల నుండి 3 కోట్ల వరకు ముట్టజెప్పుతున్నారట.
వ‌య‌సు 35 దాటినా కూడా ఇప్ప‌టికీ అనుష్క అంటే అదే ఇమేజ్ ఉంది. ముఖ్యంగా అనుష్క సినిమాలో ఉంటే హీరోతో ప‌నిలేదు. ఈమె ఒక్కో సినిమాకు దాదాపు 3.5 నుంచి 4 కోట్ల వ‌ర‌కు తీసుకుంటుంద‌ని తెలుస్తుంది.
విడాకులు తర్వాత సమంత జోరు పెరగింది. ఇన్నాళ్లూ అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన సమంత, ఇప్పుడు వరుసగా ఓకే చేసేస్తోంది. విజయదశమికి రెండు సినిమాలు అనౌన్స్‌మెంట్‌ వచ్చాయి. ఇప్పుడు సామ్‌కి 2.5 కోట్ల నుండి 3.5 ఇస్తున్నారని టాక్‌.
వరుస సినిమాలు చేస్తూ వస్తున్న కీర్తికి కూడా మంచి రెమ్యూనరేషనే అందుతోందట. తాజా లెక్కల ప్రకారం ఈమె ఒక్కో సినిమాకు దాదాపు 1 నుంచి 2.5కోట్ల వ‌ర‌కు తీసుకుంటుంద‌ని తెలుస్తుంది.
కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 12 ఏళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ స్టార్ ఇమేజ్ కొన‌సాగిస్తుంది. సినిమాకు కోటిన్న‌ర వ‌రకు చార్జ్ చేస్తుంది చంద‌మామ‌. ప్రస్తుతం చిరంజీవి ఆచార్యతో పాటు కమల్ భారతీయుడు 2లో నటిస్తుంది కాజల్