Tap to Read ➤

టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టానికి రెడీ అవుతున్న సీక్వెల్ మూవీ

కొన్నాళ్ళు సీక్వెల్ సందడి తగ్గినట్లనిపించినా మళ్ళీ పుంజుకుంది. ఇటీవల కాలంలో సీక్వెల్ హడావుడి హుషారెత్తిస్తోంది. ఇటీవల కాలంలో సూపర్ హిట్టయిన కొన్ని చిత్రాలకు సీక్వెల్స్ తెరకెక్కించే ఉత్సాహంలో ఉన్నారు పలువురు దర్శకులు.
నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హిట్ 2. సీక్వెల్‌లో అడవి శేష్ వచ్చాడు. ఈ యేడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అల్లు అర్జున్, మందన్న హీరో, హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప’. ఈ సినిమాకు రెండో భాగంగా పుష్ప 2 రాబోతుంది.
కార్తికేయ 2 ఏడేళ్ల కింద వచ్చిన కార్తికేయ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు నిఖిల్‌తోనే సీక్వెల్ చేస్తున్నాడు చందూ మొండేటి.
గూఢాచారి 2 అడవి శేష్ హీరోగా వచ్చిన గూఢాచారి సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు శేష్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు అడివి శేష్ వెల్లడించారు
జాతి రత్నాలు 2 సెన్సేషనల్ జాతి రత్నాలుకు సీక్వెల్ చేస్తానని ఇప్పటికే ప్రకటించాడు దర్శకుడు అనుదీప్. ఈ సినిమా ఈ యేడాదే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
ఢీ 2 ఢీ 14 ఏళ్ల కింద వచ్చిన ఢీ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ప్రకటించాడు శ్రీను వైట్ల. విష్ణు హీరోగా ఈ సినిమా రాబోతుంది.
క్రాక్ 2 తనకు క్రాక్ 2 చేయాలని ఉందని రవితేజ చెప్పాడు. దానికి మలినేని కూడా ఓకే చెప్పాడు.
జాంబి రెడ్డి 2 చిత్రానికి సీక్వెల్ ఇప్పుడు తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు ప్రశాంత్.