Tap to Read ➤

చిన్న వయసులోనే టాలీవుడ్ కొరియోగ్రాఫర్ మృతి.. ఆ షోకి జడ్జ్ గా కూడా?

చిన్న వయసులోనే ఆట షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న టీనా సాధు మృతి చెందారు. ఆమె అనుకోని పరిస్థితుల్లో మరణించినట్టు సమాచారం.
ఆట షో మొదటి సీజన్ విన్నర్ గా నిలిచిన టీనా సాధు మృతిచెందినట్లు కొరియోగ్రాఫర్ సందీప్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఆట వన్ విన్నర్ టీనా సాధు మృతిచెందిన దురదృష్టకరమైన వార్త విని తీవ్ర విచారణ వ్యక్తం చేస్తున్నానని ఆమె మృతి తనను షాక్ కి గురి చేసిందని ఆయన పేర్కొన్నాడు.
ఆమె చాలా అద్భుతమైన వ్యక్తి అని తనకు ఆట 1 డాన్స్ రియాలిటీ షోలో కో పార్టనర్ గా వ్యవహరించిందని సందీప్ చెప్పుకొచ్చారు.
ఆమెకు తన హృదయ పూర్వక నివాళులు అని చెబుతూనే ఆమె కుటుంబానికి ఆమె శ్రేయోభిలాషులకు సంతాపం వ్యక్తం చేస్తున్నానని అన్నారు.
అయితే ఆమె చనిపోయారు అనే విషయం తెలిసింది కానీ, ఎలా చనిపోయారు అనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ఆమె కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారు అని అంటున్నారు.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.