Tap to Read ➤

టాలీవుడ్ టాప్ అందాల లేడి యాంకర్స్

మనం రోజూ టీవీలో చూసే యాంకర్స్‌తో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మన ఇంటి సభ్యుల మాదిరే వాళ్లు కూడా ఉంటారు. ఇప్పుడు టాలీవుడ్ టాప్  యాంకర్స్ లిస్ట్.
యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో ఐనా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటోంది.
అనసూయ బుల్లితెరపై ఎంతటి స్టార్ యాంకరో వెండితెరపై కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. విభిన్నమైన పాత్రల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే
తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ.. క్రేజ్ సంపాదించుకుంది.
తెలుగులో స్టార్ యాంకర్ అంటే ఉదయ భాను మాత్రమే కనిపించేది. ఆమెకనిపిస్తే చాలు కుర్ర కారు ఉర్రూతలూగేవారు. అప్పట్లోనే హాట్ హాట్ గా స్పైసీ గా డ్రెస్ లు వేసుకుంటూ యాంకరింగ్ చేసి.. షోస్ ను తన ఇమేజ్ తో సక్సెస్ చేసేది ఉదయ భాను.
తెలుగులో బుల్లితెరపై పలు షోలు, ఈవెంట్లలో యాంకరింగ్ నిర్వహిస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తున్న తెలుగు బ్యూటిఫుల్ యాంకర్ శ్యామల. ఇటీవల కాలంలో ఒకపక్క యాంకరింగ్ నిర్వహిస్తూనే మరోపక్క పలు చిత్రాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లోనూ నటిస్తూ బాగానే ఆకట్టుకుంటోంది.
యాంకర్ మంజూష గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా పేరు తెచ్చుకోక ముందు కొన్ని సినిమాల్లో కనిపించి తన నటనతో అదరగొట్టింది.
యాంకర్‌ శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన ముద్దు ముద్దు మాటలతో పాటు ఆకర్షించే అందం, అల్లరితో ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తూ వస్తుంది. ప్రోగ్రామ్‌ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు.