Tap to Read ➤

బ్రహ్మాజీ బర్త్ డే స్పెషల్.. కొన్ని ఆసక్తికర విషయాలు

సినిమా రంగాన్ని నమ్ముకుంటే ఏదో ఒక రోజున ఆ తల్లి కరుణించక మానదు అంటారు. ఎందరో అలాగే నమ్ముకొని సినిమా రంగంలో తమదైన బాణీ పలికించారు. నటుడు బ్రహ్మాజీ కెరీర్ ను పరిశీలించి చూస్తే అది నిజమే అనిపించక మానదు.
ఆరంభంలో తన దరికి చేరిన అన్ని పాత్రలనూ పోషిస్తూ వచ్చారు. ఎక్కువగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే పలకరించాయి. అయినా నిరుత్సాహ పడలేదు.
‘శివ’లో బ్రహ్మాజీకి ఓ చిన్న వేషం లభించింది. తరువాత కృష్ణవంశీ మొదటి సినిమా ‘గులాబి’లో హీరో జేడీ చక్రవర్తికి స్నేహితునిగా ఉంటూనే, మోసం చేసే పాత్రలో నటించారు బ్రహ్మాజీ.
కృష్ణవంశీ రెండో చిత్రం ‘నిన్నే పెళ్ళాడతా’లో కామెడీ మిళితమైన పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. ఇక ఆ పై బ్రహ్మాజీ మరి వెనుతిరిగి చూసుకోలేదు.
బ్రహ్మాజీ హీరోగా ‘సిందూరం’ నిర్మించి, దర్శకత్వం వహించారు కృష్ణవంశీ. ఆ సినిమా ఆట్టే ఆకట్టుకోలేక పోయింది.
యంగ్ హీరోస్ సినిమాల్లో బ్రహ్మాజీ ఉండడం ఓ ఎస్సెట్ గా మారిపోయింది. అందువల్ల పలు సినిమాల్లో బ్రహ్మాజీ నవ్విస్తున్నారు, కవ్విస్తున్నారు. సరదాగా సాగిపోతున్నారు.
తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించిన బ్రహ్మాజీకి ఇప్పుడు మాతృభాషలోనే తీరిక లేకుండా ఉంది.
ఏది ఏమైనా చిత్రసీమలో రాణించాలని వచ్చిన బ్రహ్మాజీ పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.