100 కోట్ల కుంభకోణం.. కుట్ర.. జూ. ఎన్టీఆర్ వార్నింగ్
సినీ తారలకు ఉండే ఇమేజ్‌ను అడ్డదారుల్లో క్యాష్ చేసుకొనేందుకు కొందరు అవినీతి అక్రమాలకు పాల్పడటం గతంలో కూడా బయటకు వచ్చాయి. అయితే ఆయా తారలు సరైన సమయంలో స్పందించడం వల్ల భారీ ప్రమాదాలు తప్పాయి. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఉన్న పాపులారిటీ, ప్రేక్షకుల్లో ఉండే అభిమానాన్ని ఉపయోగించుకొని 100 కోట్ల కుంభకోణానికి ప్లాన్ చేసిన తీరు బట్టబయలైంది. ఈ స్కామ్‌ను ఆరంభంలోనే గుర్తించి ఎన్టీఆర్ టీమ్ మేల్కొనడంతో పెను ముప్పు తప్పింది. ఎన్టీఆర్ పాపులారిటీ, ప్రతిష్ట, గుర్తింపు, అభిమానుల్లో ఉండే సెంటిమెంట్‌కు భంగం కలుగకుండా అడ్డు కట్ట వేశారు. ఈ వ్యవహారంపై ఎన్టీఆర్ సీరియస్ అవ్వడమే కాకుండా అధికారికంగా ఓ ప్రకటనను కూడా జారీ చేశారు. ఆ స్కామ్ ఏమిటి? ఎన్టీఆర్ ఇచ్చిన ప్రకటన ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
జూ. ఎన్టీఆర్ పేరిట హెల్త్ చారిటీని ఆన్‌లైన్‌లో ప్రారంభించి 100 కోట్ల రూపాయలను సేకరించేందుకు కొందరు కుట్రకు తెరలేపారు. కొన్ని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రకటనలు జారీ చేసి డబ్బును అక్రమంగా పోగు చేసేందుకు సిద్దమయ్యారు. దాదాపు 100 కోట్ల రూపాయల మేర నిధిని సేకరిస్తున్నాం. హెల్త్‌కు సంబంధించిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాం అంటూ కొందరు నిధుల సేకరణకు పాల్పడ్డుతున్నాం ప్రకటనలు వచ్చాయి. ఎన్టీఆర్ కోసం మీరు అందించే విరాళాలు ఫలానా అకౌంట్లకు జమ చేయాలని కోరారు.

ఎన్టీఆర్ పేరును ఉపయోగించి కొందరు నిధుల సేకరిస్తున్నారు. అభిమానుల నుంచి విరాళాలు రాబడుతున్నారనే విషయం బయటకు పొక్కడంతో యంగ్ టైగర్ టీమ్ అప్రమత్తమైంది. ఈ కుంభకోణం వెనుక ఎవరు ఉన్నారనే విషయాన్ని పసిగట్టారు. అయితే సోషల్ మీడియాలో ఊరు వాడ అనే అకౌంట్ ద్వారా ఈ విరాళాల సేకరణకు బీజం పడింది అనే విషయం దృష్టికి వచ్చింది. నందమూరి తారక రామారావు గారి స్పూర్తితో రానున్న కాలంలో సుమారుగా 100 కోట్ల రూపాయల సేవా యజ్టం అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తన పేరుతో ఏదో మోసం, కుట్రకు ప్లాన్ వేశారని గమనించిన ఎన్టీఆర్ వెంటనే ఓ ప్రకటనను అధికారికంగా విడుదల చేశారు.
ఎన్టీఆర్ కార్యాలయం పేరుతో వెలువడిన ప్రకటన ప్రకారం.. ఎన్టీఆర్ పేరుతో కొన్ని ఫ్యాన్స్ గ్రూపులు చారిటీ పేరుతో నిధులను సేకరిస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. అలాంటి ఫ్యాన్స్ గ్రూపులకు గానీ, అలాంటి చారిటీ కార్యక్రమాలతో ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాం అని తమ ప్రకటనలో తెలిపారు.
ఎన్టీఆర్ పేరుతో ఎలాంటి విరాళాలు ఇవ్వమని అడిగినా.. నా శ్రేయోభిలాలు, అభిమానులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాంటి అభ్యర్థనలను ప్రోత్సహించకండి. అలాంటి విరాళాలు, నిధుల సేకరణకు మాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి మీరంత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఏమైనా ఉంటే.. స్వయంగా ఎన్టీఆర్ ద్వారానే ప్రకటన వెలువడుతుంది అని తమ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇలాంటి విషయంలో మాకు అండగా ఉంటూ.. మమల్ని అర్థం చేసుకొన్న అభిమానులకు మా ధన్యవాదాలు అంటూ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ప్రకటన వెలువడింది.
ఇక ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో వార్ 2 చిత్రంతో పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మైత్రీ మూవీ మేకర్స్ భాగస్వామ్యంలో డ్రాగన్ అనే సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications