Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. చరణ్ సినిమా వచ్చేది అప్పుడేనా!

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్లుగా వెలుగొందుతోన్న హీరోలు చాలా మందే ఉన్నారు. అందులో కొందరు మాత్రమే మరింత ప్రత్యేకంగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. బడా బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన టాలెంట్లతో తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి వైవిధ్యమైన అంశాలతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది వచ్చిన RRRతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతోన్నాడు.

\మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు దేశం మొత్తం చెప్పుకునే విధంగా గ్రాండ్‌గా జరిగాయి. ఇక, ఈ మూవీకి సంబంధించి గత ఏడాది చివర్లో రెగ్యూలర్ షూటింగ్‌ ప్రారంభం అయింది. అప్పటి నుంచి చిత్ర యూనిట్ వరుసగా షెడ్యూళ్లను జరుపుకుంటూ వచ్చింది. దీంతో చాలా వరకూ టాకీ పార్టు పూర్తి అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఓ న్యూస్ బయటకు వచ్చింది.

100 Days of Shoot Balance of Ram Charan and S. Shankar Movie

రామ్ చరణ్ - శంకర్ కలయికలో రాబోతున్న ఈ మూవీకి సంబంధించి ఓ పాటను చిత్రీకరించడం కోసం యూనిట్ న్యూజిలాండ్‌కు పయనం కాబోతుందని తెలిసింది. ఇందులో హీరో, హీరోయిన్లపై అదిరిపోయే డ్యూయెట్‌ను షూట్ చేయబోతున్నారట. మరోవైపు, ఈ సినిమాకు ఇంకా వంద రోజులకు పైగానే షూటింగ్ బ్యాలెన్స్ ఉందని కూడా ఓ షాకింగ్ న్యూస్ లీక్ అయింది. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితియార్ధంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే మెగా అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లే అవుతుందని చెప్పొచ్చు.

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు అందిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, జయరాం, అంజలి తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ చిత్రానికి 'సర్కారోడు', 'సిటిజన్' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X