ఒక్క ప్లాఫ్ కూడా లేని డైరెక్టర్స్.. నార్త్ నుంచి ఒక్కరే సౌత్ నుంచి 5 గురు.. ఎవరెవరంటే?

ఇండియన్ ఫిల్మ్ కు వరల్డ్ వైడ్ గా క్రేజ్ దక్కుతోంది. ముఖ్యంగా దక్షిణాది దర్శకుల నుంచి వస్తున్న ప్రాజెక్ట్స్ కు సౌత్ తో పాటు నార్త్, ఓవర్సీస్ లోనూ మంచి అప్లాజ్ దక్కుతోంది. అయితే బాహుబలి ముందు వరకు కూడా సౌత్ సినిమాలపై కాస్తా చిన్న చూపు ఉండేది. క్వాలిటీ విషయంలో, క్రేజ్ విషయంలో, విజువల్స్, సౌండ్, యాక్షన్ వంటి విషయాల్లో వరల్డ్ ఆడియెన్స్ ను పెద్దగా మెప్పించలేదు. కానీ బాహుబలి తర్వాత నుంచి వచ్చిన ప్రతి స్టార్ హీరో చిత్రం సంచలనంగా మారింది.

హాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు..
వరల్డ్ ఆడియెన్స్ తో పాటు హాలీవుడ్ దర్శకులు, టెక్నీషియన్లనే మెప్పించే స్థాయికి చేరుకున్నాం. ఇక ప్రస్తుతం తెలుగు చిత్రాలకు హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు పని చేస్తుండటం విశేషం. ఇక బాహుబలి తర్వాత కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్, కాంతార, విక్రమ్, సలార్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. ఈ సందర్భంగా ఇండియాలో 100 శాతం సక్సెస్ అందుకున్న దర్శకులు ఎవరు? అందులో సౌత్ లో ఎంత ఎవరెవరు? నార్త్ లో ఎవరు ఉన్నారనే వివరాల్లోకి వెళితే..

100 Percent Successful Directors in India

ఇండియాలో ఒక్క ఫెయిల్ లేని డైరెక్టర్స్..
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు. వారు అనుభవం, సినిమాను కొత్తగా ఆవిష్కరించేందుకు వారు చేసిన ప్రయత్నం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, సాండల్ వుడ్ చిత్ర పరిశ్రమ నుంచి 100ల మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు. వారిలో ఇప్పటి ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేని దర్శకులు మాత్రం అతి కొద్ది మందే ఉన్నారు. వారిలో మొదటి స్థానంలో ఎస్ఎస్ రాజమౌళి నిలిచారు.

ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పటి వరకు అపజయం చూడలేదు. ఆయన దర్శకత్వంలో మొత్తం 12 చిత్రాలు విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి. అందులో బాహుబలి తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇండియన్ ఫిల్మ్ స్థాయిని వరల్డ్ మార్కెట్ లో పెంచింది. 12 చిత్రాల్లో ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. 2వ స్థానంలో అనిల్ రావిపూడి నిలిచారు. చిత్రాలకు 8 చిత్రాలకు దర్శకత్వం వహించి అన్ని సక్సెస్ కొట్టారు.

ఆ తర్వాత 3వ స్థానంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు 6 చిత్రాలను డైరెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్స్ ను అందుకున్నారు. 4, 5వ స్థానాల్లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లు లోకేష్ కనగరాజ్, అట్లీ కుమార్ ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటి వరకు కెరీర్ లో చెరో 5 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అన్నీ బ్లాక్ బాస్టర్ గానే నిలిచాయి. ఇక సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 6వ స్థానంలో ఉన్నారు. 4 చిత్రాలను డైరెక్ట్ చేయగా అవి వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కాగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే 5గురు దర్శకులు ఉండటం విశేషంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X