‘ఇంట్లో కూర్చొనే 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా’.. మహావతార్ నర్సింహా మూవీ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
హిందూ మైథలాజికల్ యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఊపూపుతోంది. దీంతో ఈ సినిమా దర్శకుడు అశ్విన్ కుమార్ స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నారు. గతంలో పలు ప్రాజెక్ట్స్ చేస్తూ వస్తున్నప్పటికీ మహావతార్ నర్సింహ యానిమేటెడ్ ఫిల్మ్ తో భారీ సక్సెస్ ను అందుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రంతో ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేశారు దర్శకుడు అశ్విన్ కుమార్. ఈ సినిమా సక్సెస్ సందర్భంగా ఆయన బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇండియన్ సినిమా, యానిమేషన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఎవరీ అశ్విన్ కుమార్..
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అశ్విన్ కుమార్ మహావతార్ నర్సింహాతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆయన పేరే మారుమోగుతోంది. ఇక ఈయన డైరెక్టర్ గా, ఎడిటర్ గా, రైటర్ గా పలు ప్రాజెక్ట్ కు వర్క్ చేశారు. ఫిల్మ్ మేకర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆయన క్లీమ్ వీఎఫ్ఎక్స్ అనే స్టూడియోను స్థాపించారు. విజువల్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, అడ్వర్టైజింగ్ విభాగాల్లో అనుభవం కలిగి ఉన్నాడు. అలాగే ఆయనకు హిందూ గ్రంథాలు, శాస్త్రాలపై మంచి పట్టు ఉన్నవారు.

అశ్విన్ కుమార్ ప్రాజెక్ట్స్..
ఇక ఆయన స్థాపించిన క్లీమ్ వీఎఫ్ఎక్స్ స్టూడియో నుంచి పలు బాలీవుడ్ చిత్రాలు బయటికి వచ్చాయి. హరి పుత్తుర్, జానే తు యా జానే నా, నో స్మోకింగ్ వంటి చిత్రాలకు వర్క్ చేశారు. ఇక ఆయన యానిమేటెడ్ ఫిల్మ్స్ ను నిర్మించడంపై ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉన్నారు. ఈ క్రమంలో కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తో కలిసి మహావతార్ సిరీస్ ను ప్రారంభించారు. ఈ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటగా మహావతార్ నర్సింహాను అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేసి మంచి సక్సెస్ ను అందుకున్నారు.
ఇంట్లో కూర్చున్నా 1000 కోట్లు కలెక్షన్స్..
మహావతార్ నర్సింహా చిత్రం భారీ విజయవంతం అయిన తర్వాత డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రీసెంట్ గా ఇండియన్ సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'ప్రస్తుతం సినిమాలు తీసే విధానం చాలా మారిపోయింది. ఇప్పుడు ఐదుగురు టెక్నీషియన్లు ఇంట్లో కూర్చొబెట్టుకొని 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీయడం చాలా ఈజీ. మున్ముందు ఈ పరిణామాన్ని చూస్తాం.' అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. డైరెక్టర్ అశ్విన్ కుమార్ దూరదృష్టి వైరల్ అయ్యింది.
మహావతార్ సినిమాటిక్ యూనివర్స్..
2025 జూలై 25న మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మొదటి ఇన్ స్టాల్ మెంట్ లో మహావతార్ నర్సింహా యానిమేటెడ్ ఫిల్మ్ ను అందించారు. 2027లో మహావతార్ పరశురామ్, 2029లో మహావతార్ రఘునందన్, 2031లో మహావతార్ ద్వారకాధీష్, 2033లో మహావతార్ గోకులానంద, 2035లో మహావతార్ కల్కి పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి పార్ట్ 2ను విడుదల చేస్తామని ఇప్పటికే హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. ఇక మహావతార్ నర్సింహా చిత్రం వరల్డ్ వైడ్ గా 180 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూల్ చేసింది. ఇండియన్ యానిమేటెడ్ ఫిల్మ్స్ లో హ్యాయెస్ట్ గ్రాస్ వసూల్ చేసిన చిత్రంగా ఆల్ టైమ్ రికార్డ్ ను సెట్ చేసింది.


Click it and Unblock the Notifications











