Pawan Kalyan కోసం 1000 మంది.. అబ్బో ఇది మామూలు ప్లాన్ కాదుగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు బడా హీరోగా వెలుగొందుతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల పాటు రాజకీయాల కోసం గ్యాప్ తీసుకున్న పవన్.. 'వకీల్ సాబ్' మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇది అనుకున్న రీతిలో స్పందనను అందుకుని భారీ వసూళ్లను రాబట్టింది. ఫలితంగా పవన్‌కు గ్రాండ్ రీఎంట్రీ దక్కినట్లైంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సరికొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ ముందుకు వెళ్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొద్ది రోజుల క్రితమే 'భీమ్లా నాయక్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో దగ్గుబాటి రాణా కీలక పాత్రలో నటించాడు. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. ఎస్ థమన్ దీనికి సంగీతం అందించాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ, రెండో వారం నుంచి వసూళ్లు భారీగా డౌన్ అయ్యాయి. ఫలితంగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోలేదు. కానీ, మొత్తంగా ఈ చిత్రం 97 కోట్ల రూపాయలకు పైగా షేర్‌ను రాబట్టింది.

1000 Fighters for Harihara Veeramallu Action Episode

పవన్ కల్యాణ్ ఇప్పటికే మొదలు పెట్టిన సినిమాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీని ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న ఈ చిత్రంలో ఈ స్టార్ హీరో వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే, దీన్ని మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడడంతో పాటు పవన్ కల్యాణ్ బ్రేక్ తీసుకున్నాడు. ఈ గ్యాప్‌లోనే 'భీమ్లా నాయక్' మూవీని కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక, ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను యూనిట్ ఇటీవలే మొదలు పెట్టింది.

ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరుగుతోంది. తాజాగా జరుగుతోన్న షెడ్యూల్‌లో యాక్షన్ ఎపిసోడ్స్‌ను షూట్ చేయబోతున్నారు. దీనికోసం పవర్ స్టార్ యాక్షన్ సీన్స్‌ను ప్రాక్టీస్ కూడా చేశాడు. ఇక, దీని కోసం ఏకంగా 1000 మంది ఫైటర్లను కూడా తీసుకొచ్చారని తెలుస్తోంది. వీళ్లకు చాలా రోజులుగా అక్కడ ఫైట్ మాస్టర్లు శిక్షణ కూడా ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ వేయి మందితో జరిగే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలవబోతుందని అంటున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ ఫైటింగ్స్ స్పెషల్ అట్రాక్షన్‌ కాబోతున్నాయని కూడా తెలిసింది.

1000 Fighters for Harihara Veeramallu Action Episode

క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రాబోతన్న 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన 60 శాతం షూటింగ్ పూర్తైంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. ఈ మూవీకి భారీ స్థాయిలో రూ. 180 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారనే ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X