118 ప్రీరిలీజ్ వేడుక: కళ్లనీళ్లు పెట్టుకొన్నా.. అలా ఏడ్చాను.. ఎన్టీఆర్ ఎమోషనల్

కల్యాణ్ రామ్, నివేదా థామస్, షాలిని పాండే కలిసి నటించిన 118 చిత్రం మార్చి 1న రిలీజ్ కానున్నది. ఈ క్రమంలో సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన అమర వీరులకు నివాళులర్పించారు. ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ప్రీరిలీజ్‌కు ప్రతీ ఒక్కరికి, పెద్దలకు, ముఖ్య అతిథిగా వచ్చిన బాబాయ్ బాలకృష్ణకు స్వాగతం సుస్వాగతం అన్నారు. ఇంకా ఎన్టీఆర్ ఏమన్నారంటే..

 సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ గురించి ఏళ్లుగా

సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ గురించి ఏళ్లుగా

సినిమాటోగ్రాఫర్‌గా కేవీ గుహన్ చాలా ఏళ్ల నుంచి నాకు తెలుసు. బాద్షా సినిమా కోసం పనిచేశాం. బంతిపూల జానకి షూటింగ్ సమయంలో మైనస్ 16 డిగ్రీల చలిలో పనిచేశాం. ఆ పాట అద్భుతంగా రావడానికి సినిమాటోగ్రాఫర్‌గా గుహన్ కారణం. ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఆయన వాటిని పట్టించుకోడు అని అన్నారు.

 బాద్షాలో చిత్రంలో బంతిపూల జానకి‌ పాట కోసం

బాద్షాలో చిత్రంలో బంతిపూల జానకి‌ పాట కోసం

బంతిపూల జానకి పాట షూటింగ్ సమయంలో చలికి తట్టుకోలేక కారులోనో, వ్యానులో తలదాచుకొనే వాళ్లం. కానీ ఆయన షూటింగ్ జరిగిన రోజుల్లో ఒక్కరోజు కూడా కారులోనో, వ్యాన్‌లోకి రాకుండా చలిలో తెరకెక్కించారు. అందుకే ఆ పాటను అద్భుతంగా మలిచాడు. అలాంటి ప్రతిభ, అంకితభావం ఉన్న వ్యక్తి 118 సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. మా అన్నయ్య కల్యాణ్ రామ్ కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా మారుతుందని ఆశిస్తున్నాను.

నివేదా థామస్ నటన కళ్లనీళ్లు పెట్టించింది

నివేదా థామస్ నటన కళ్లనీళ్లు పెట్టించింది

118 చిత్రంలో నటించిన నివేదా థామస్‌తో నేను జై లవకుశ చిత్రంలో పనిచేశాను. ఆమె ఎంత అద్భుతమైన నటి మాటల్లో చెప్పలేను. 118 సినిమా ఇప్పటికే చూశాను. ఓ సీన్‌లో నివేదా థామస్ నటన చూసి నా ప్రమేయం లేకుండా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ జనరేషన్‌లో అద్భుతమైన నటి నివేదా థామస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నీ అంకితభావాన్ని అలాగే కొనసాగించాలని కోరుకొంటున్నాను.

షాలిని పాండే గ్లామర్ కూడా

షాలిని పాండే గ్లామర్ కూడా

118 చిత్రంలో మరో హీరోయిన్‌గా నటించిన షాలిని పాండే నటన, గ్లామర్ బాగుంది. ఆమె ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమా విజయంలో కీలకంగా మారుతుంది. అలాగే ఈ చిత్రం కోసం పనిచేసిన నటులు, సాంకేతిక నిపుణులు కూడా విజయంలో భాగం కానున్నారు. ఈ చిత్రం కోసం పనిచేసిన వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను.

నిర్మాత మహేష్ కోనేరు గురించి

నిర్మాత మహేష్ కోనేరు గురించి

నిర్మాత మహేష్ కోనేరు గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచింది. ఆయన మాకు చాలా కావాల్సిన వ్యక్తి. ఈ సినిమా ద్వారా మహేష్‌కు మంచి సక్సెస్ దక్కుతుందని ఆశిస్తున్నా. ఈ చిత్ర విజయం మరిన్ని మంచి సినిమాలకు స్ఫూర్తిగా మారుతుంది. మంచి అని ఎన్టీఆర్ అన్నారు.

కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే ది బెస్ట్

మా అన్నయ్య కల్యాణ్ రామ్ గురించి కొన్ని మాటలు చెబుతాను. ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఏదైనా మొదలుపెడితే ఎండ్ అయ్యేవరకు క్యూరియాసిటి ఉంటుందనే మాటలు ఆయనకు సరిగ్గా సరిపోతాయి. విభిన్నమైన చిత్రాల కోసం అహర్నిశలు ప్రయత్నిస్తుంటారు. ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే బెస్ట్ సినిమా అవుతుంది. ఈ సినిమాలో ఆయన నటన అద్భుతం. ఇంకా ఎన్నో మంచి చిత్రాలు చేయడానికి ఈ సినిమా దారి వేస్తుంది అని ఎన్టీఆర్ మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X