‘118’ ట్రైలర్ ఔట్ స్టాండింగ్... కళ్యాణ్ రామ్ ఈ సారి గట్టిగా కొట్టేలా ఉన్నాడు!
నందమూరి కళ్యాణ్, నివేథా థామస్, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం '118'. సినిమాటోగ్రాఫర్‌గా సినీ ప్రేమికులకు సుపరిచితం అయిన కె.వి.గుహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 'నా నువ్వే' అనే చిత్రాన్ని నిర్మించిన మహేష్ కోనేరు 'ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్' బేనర్లో నిర్మించారు.
మార్చి 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు స్పష్టమవుతోంది.

అమ్మాయి కోసం జరిపే అన్వేషణ
ట్రైలర్లో చూపించిన సీన్లను బట్టి ఒక అమ్మాయి(నివేథా థామస్) కోసం జరిపే అన్వేషణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇంతకీ అమ్మాయి ఉందా? లేదా? అనే సస్పెన్స్ ట్రైలర్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి.

కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ అదుర్స్
ట్రైలర్లో కళ్యాణ్ రామ్ లుక్, పెర్ఫెర్మెన్స్ సూపర్బ్ అనేలా ఉంది. ప్రతీ సీన్లోనూ పెర్ఫెక్షన్ కోసం తపించినట్లు కనిపిస్తోంది. నివేథా థామస్, షాలిని పాండే గ్లామర్ కూడా సినిమాకు మరింత ప్లస్ అయ్యేలా ఉంది.

అదిరిపోయే టేకింగ్
బ్యూటీఫుల్ విజువల్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ప్రముఖ ఛాయాగ్రాహకులు కె.వి.గుహన్... దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ట్రైలర్ చూస్తుంటే మూవీ టేకింగ్ అదిరిపోయే విధంగా ఉంటుందనే భావన కలగడజేయడంలో సక్సెస్ అయ్యాడు.
118
నందమూరి కల్యాణ్ రామ్, నివేదా థామస్, షాలిని పాండే తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: మిర్చి కిరణ్, పి.ఆర్ అండ్ మార్కెటింగ్: వంశీ కాక, ఆర్ట్: కిరణ్ కుమార్.ఎం, ఎడిటర్: తమ్మిరాజు, సంగీతం: శేఖర్ చంద్ర, ఫైట్స్: వెంకట్, అన్బరివు, రియల్ సతీశ్, వి.ఎఫ్.ఎక్స్: అద్వైత క్రియేటివ్ వర్క్స్, అనిల్ పడూరి, నిర్మాత: మహేష్ కొనేరు, కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: కె.వి.గుహన్.


Click it and Unblock the Notifications











