పవన్ మాస్.. 1200 మంది మహిళా పోలీసులకు భీమ్లా నాయక్ స్పెషల్ షో..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలు చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యామని కూడా చెబుతుంటారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుంది అంటే ఆఫీసులకు కూడా సెలవు ప్రకటించిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా 12 వందల మంది పోలీసులు ఒకే సారి భీమానాయక్ సినిమా చూసిన అంశం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

భీమ్లా నాయక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రానా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు అందించారు, అలాగే దర్శకత్వ పర్యవేక్షణ కూడా ఆయన చేశారు. నిత్యామీనన్ సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో రావు రమేష్, సముద్రఖని, రఘు బాబు, పమ్మి సాయి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

1200 మంది మహిళా పోలీసు సిబ్బంది
సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని అద్భుతమైన కలెక్షన్లతో దిశగా పయనిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో ఈ సినిమా కలెక్షన్లు వంద కోట్లకు ఇంకా చేరువ కాలేదు. అయితే అయితే సినిమా పవన్ ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా విపరీతంగా నచ్చింది.. అయితే ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా ఈ సినిమాను 1200 మంది మహిళా పోలీసు సిబ్బంది వీక్షించడం ఆసక్తికరంగా మారింది.

సినిమా చూపించాలని
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో 1200 మంది మహిళా పోలీసులు జీవీకే మాల్ సినిమాను వీక్షించారు. నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఉమెన్స్ డే సందర్భంగా మహిళా ఉద్యోగులు అందరికీ ప్రత్యేకంగా సెలవు ప్రకటించింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక పోలీస్ అధికారి పాత్రలో నటించడంతో మహిళా పోలీసులు అందరికీ ఈ సినిమా చూపించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.

వరుస సినిమాలను
అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగే పోరాటం గా ఈ సినిమాను తెరకెక్కించగా సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ఇప్పటికే ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నారు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్నారు.

ఓకే థియేటర్ లో
హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అలాగే బండ్ల గణేష్ నిర్మాణంలో కూడా ఒక సినిమా చేస్తానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. ఒకపక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా గడుపుతున్న ఆయన వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి తర్వాత పూర్తిస్థాయి కాన్సన్ట్రేషన్ రాజకీయాల మీద పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. మొత్తం మీద 1200 మంది పోలీసు సిబ్బంది ఓకే థియేటర్ లో పవన్ కళ్యాణ్ సినిమా వీక్షించడం అనేది ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











