అదీ చిరు రేంజ్.. ఇండియాలోనే అతి పెద్ద భారీ కటౌట్.. ఎన్ని ఫీట్లో తెలిస్తే కళ్లు చెదరాల్సిందే.. చూశారా?
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య ఫుల్ జోష్ మీద ఉన్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ... బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో ఏకంగా 200 కోట్లకు పైగా వసూలు చేసి సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. ఇక ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో భోళా శంకర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిరంజీవి భారీ కటౌట్ ను సూర్యాపేటలో ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఆ వివరాల్లోకి వెళితే....
సంక్రాంతి విన్నర్: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నాడు. ఖైదీ నెంబర్ 150 తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన చిరు... వరుస సినిమాలతో కుర్ర హీరోలకు పోటీనిస్తూ సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ తో హిట్ కొట్టిన చిరు.. ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమాను విడుదల చేశాడు. ఇది ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో సంక్రాంతి విజేతగా చిరంజీవి నిలిచాడు.

సూపర్ రెస్పాన్స్: ఇదిలా ఉంటే చిరంజీవి ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా కొట్టుకుంటున్నాయి. ట్రైలర్ లో చెప్పిన డైలాగ్స్, చిరు స్వాగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

తెలుగుకు తగ్గట్లుగా: ఇక ఈ సినిమా తమిల్ లో అజిత్ కుమార్ నటించిన వేదాలం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. అయితే మెహర్ రమేష్ తెలుగు నేటివీటికి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా నటిస్తుంది. కీర్తి సురేష్.. చిరుకి చెల్లెలి పాత్రలో కనిపించగా... సుశాంత్ ఆమె భర్త పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

మెగా కటౌట్: రిలీజ్ డేట్ దగ్గర పడుతుండంతో.. మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభం చేశారు. తాజాగా సూర్యపేటలో ఈ సినిమా ప్రమోషన్స్ ను వినూత్నంగా ప్రారంభించారు. విజయవాడ - హైదరాబాద్ హైవేపై భోళా శంకర్ మెగా కటౌట్‌ను ఏర్పాటు చేశారు. సూర్యాపేటలోని రాజు గారి తోట రెస్టారెంట్‌లో ఈ 126 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదే అతిపెద్ద కటౌట్ అని మేకర్స్ వెల్లడించింది. ఇక ఇది ప్రేక్షకులను ఆకర్షించేందుకే అని తెలుస్తోంది.

ఇండియాలోనే: ఇక ఇలాంటి కటౌట్స్ విషయానికి వస్తే... దళపతి విజయ్ కటౌట్ ను కేరళలో 120 అడుగులతో పెట్టారు. తమిళనాడులో సూర్య కటౌట్ ను 110 అడుగులుగా ఏర్పాటు చేశారు. అయితే మెగాస్టార్ చిరు కటౌట్ 126 అడుగులు పెట్టి.. చరిత్ర సృష్టించారు. అదీ చిరు రేంజ్ అంటే.. అని అభిమానులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











