అంచనాలు పెంచేస్తున్న RRR అప్‌డేట్: అసలు కథ అప్పుడే మొదలవుతుంది
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.
RRR షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే అవుతోంది. అయినప్పటికీ పలుమార్లు ఆటంకం ఏర్పడడం వల్ల ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తవలేదు. కరోనా తర్వాత వేగం పెంచిన చిత్ర యూనిట్ వరుస షెడ్యూళ్లను పూర్తి చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, కర్నాటక షెడ్యూళ్లు కంప్లీట్ చేసేసింది. ప్రస్తుతం హీరోయిన్ ఆలియా భట్ పరిచయ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అదే సమయంలో కొన్ని వందల మంది ఆర్టిస్టులతో దర్శకుడు రాజమౌళి ట్రైనింగ్ సెషన్ నిర్వహిస్తున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం... RRR యాక్షన్ సీక్వెన్స్‌ను భారీగా ప్లాన్ చేశారట. అందుకోసం కొన్ని వందల మంది ఫైటర్లకు 150 రోజుల ట్రైనింగ్ సెషన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీనికి ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ సోలోమన్ రాజు నాయకత్వం వహిస్తున్నారని సమాచారం. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న షెడ్యూల్‌లో వీళ్లందరితో యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరిస్తారని అంటున్నారు. అందుకోసమే ముందు జాగ్రత్తగా ఇప్పటి నుంచే ఫైటర్లకు ట్రైనింగ్ ఇస్తున్నారట. ఆ షెడ్యూల్‌లో ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు చిత్రీకరిస్తారనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











