‘2.0’ నిర్మాతల కోట్ల రూపాయల నష్టం తీరే డేట్ ఫిక్స్ అయింది!
ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్ మూవీ, రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన '2.0' చైనా విడుదలకు రంగం సిద్ధమైంది. జులై 12న విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. అక్కడ ఈ చిత్రాన్ని '2.0: రిసర్జెన్స్' పేరుతో విడుదల చేస్తున్నారు.
చైనా వ్యాప్తంగా ఈ చిత్రాన్ని దాదాపు 50.000 స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. వాస్తవానికి ఈ చిత్రం ఇక్కడ మే నెలలోనే విడుదలవ్వాల్సి ఉండగా పలు కారణాలతో విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫైనల్ చేశారు.
రజనీకాంత్ మూవీ చైనాలో ఇంత పెద్ద మొత్తంలో విడుదల కావడం ఇదే తొలిసారి. ఆయన సినిమాలకు జపాన్, మలేసియా, ఇతర దేశాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే చైనాలో రజనీ సినిమాల భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనేది '2.0'తో మరికొన్ని రోజుల్లో తేలుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

2.0 మూవీ దాదాపు రూ. 570 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ వారు కనీసం రూ. 1000 కోట్లు రాబడుతుందనే అంచనాలతో విడుదల చేశారు. అయితే నెగెటివ్ టాక్ రావడంతో కేవలం రూ. 625 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్ కాస్త కోట్లాది రూపాయల లాస్ వెంచర్‌గా మిగిలింది.
2.0 చైనా రిలీజ్ లైకా ప్రొడక్షన్స్ సంస్థను లాభాల బాటలోకి తెస్తుందా? లేదా? అనేది చర్చనీయాంశం అయింది. గతంలో చైనాలో రిలీజైన ఇండియన్ సినిమాలు నిర్మాతలకు భారీ లాభాలు కురిపించాయి. చైనీయులకు ఈ సినిమా నచ్చితే ఓకే.. లేక పోతే మరింత నష్టం తప్పదు అంటున్నారు.
ఈ చిత్రంలో రజనీకాంత్ సైంటిస్టుగా, రోబో చిట్టిగా ద్విపాత్రాభినయం చేయగా.... అక్షయ్ కుమార్ పక్షిరాజుగా విలన్ పాత్రలో నటించాడు. చిట్టి రోబోకు సహాయం చేసే లేడీ రోబో పాత్రలో అమీ జాక్సన్ నటించింది.


Click it and Unblock the Notifications











