పిచ్చి అభిమానం: 2.0 థియేటర్లో ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?(వైరల్ వీడియో)
మనలో దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక హీరోను అమితంగా ఇష్టపడతాం, అభిమానిస్తాం. అయితే కొందరిలో ఈ అభిమానం లెవల్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు చేసే పనులు మామూలు వ్యక్తులకు వింతగా అనిపిస్తుంటాయి. కొందరు దాన్ని వెర్రి అభిమానం, పిచ్చి అభిమానం అని కూడా పిలుస్తుంటారు.
రజనీకాంత్ నటించిన 2.0 సినిమా విడుదల నేపథ్యంలో తమిళ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా చూసి సాధారణ ప్రేక్షకలు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైరల్ అవుతున్న వీడియో
తెరపై తలైవా బొమ్మ పడగానే సినిమాను పాస్ చేయించి థియేటర్లోనే కొంత సేపు డప్పుల మోత మధ్య డాన్స్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. హీరో బొమ్మ పడగానే పేపర్లు ఎగరవస్తూ డాన్సులు చేయడం మామూలే కానీ.... ఇలా ఏకంగా సినిమాను ఆపి మరీ చిందులేస్తున్న దృశ్యాలు చూడం ఇదే తొలిసారి.
ముంబైలో రజనీ అభిమానుల సందడి
ముంబైలో రజనీకాంత్ అభిమానులు సందడి అంతా ఇంతా కాదు. బుధవారం రాత్రి నుంచే ఇక్కడ సందడి మొదలైంది. తమ హీరో సినిమా రిలీజ్‌ను తమదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నారు.
చంటి పిల్లలను తీసుకుని మరీ...
కొందరు మహిళలు అయితే చంటి పిల్లలను తీసుకుని మరీ తెల్లవారు ఝామున మొదలయ్యే బెనిఫిట్ షోలకు వచ్చేయడం గమనార్హం.
మలేషియాలోనూ రజనీ ఫీవర్
సౌత్ ఇండియన్స్, ముఖ్యంగా తమిళలు ఎక్కువగా ఉండే మలేషియాలో సైతం 2.0 ఫీవర్ మొదలైంది. అక్కడ సినిమా ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయో మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











