For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  20 Years Of Nuvve Nuvve: త్రివిక్రమ్ మొదటి సినిమాకు 20 ఏళ్ళు.. ఆ ఒక్క పాట కోసమే భారీగా ఖర్చు

  |

  టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పరిశ్రమలోకి మొదటగా ఒక రచయితగా అడుగుపెట్టి ఆ తర్వాత దర్శకుడిగా మారారు. ఇక ఆయన డైరెక్ట్ చేసిన మొట్టమొదటి మూవీ నువ్వే నువ్వే సినిమా 2002 అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సోమవారం నాటికి ఆ సినిమా వచ్చి 20 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ స్రవంతి రవి కిషోర్ సినిమా స్పెషల్ షోను AMB సినిమాస్ లో ప్రదర్శించారు. వీక్షించేందుకు పలువురు సినీ ప్రముఖులు అలాగే సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ తో పాటు నటీనటులు కూడా పాల్గొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

  ఫ్యామిలీ లవ్ స్టోరీగా

  ఫ్యామిలీ లవ్ స్టోరీగా

  ఈ సినిమాలో తరుణ్ హీరోగా నటించిగా శ్రియ శరన్ హీరోయిన్ గా నటించింది. మరొక ముఖ్యమైన తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించిన విషయం తెలిసిందే. ఇక కామెడీ పాత్రలో సునీల్ కూడా ఈ సినిమాలో ఎంతగానో నవ్వించాడు. కుటుంబ కథ చిత్రంగా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమకథగా కూడా ఈ సినిమాలో హైలైట్ చేసిన విధానం అప్పట్లో ఒక మంచి రిజల్ట్ అందుకుంది. ఇక ఇప్పటికీ కూడా ఈ సినిమాలోని సన్నివేశాలు యూట్యూబ్లో వైరల్ అవుతుంటాయి.

  కథ చెప్పినప్పుడు

  కథ చెప్పినప్పుడు

  ఇక ఈ సినిమా గురించి మరోసారి గుర్తు చేసుకుంటూ నిర్మాత స్రవంతి రవికిశోర్ తన వివరణ ఇచ్చారు. ఈ సినిమా మనసుకు చాలా దగ్గరైన సినిమా. ఈ సినిమా కథను మొదట నాకు త్రివిక్రమ్ నువ్వే కావాలి సినిమా షూటింగ్లో ఉండగా చెప్పాడు. ఆ కథ చెబుతున్నంతసేపు కూడా మేమిద్దరం ఒక గెస్ట్ హౌస్ లో అలా నడుస్తూనే ఉన్నాము. కటగా నచ్చడంతో వెంటనే ఈ సినిమా కథకు నువ్వే దర్శకుడు అని కూడా నేను చెప్పేసాను.. అని అన్నారు.

  వేరే ఆఫర్స్ వచ్చినా

  వేరే ఆఫర్స్ వచ్చినా


  ఇక ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావ్ సినిమా షూటింగ్ లోనే సాంగ్స్ షూటింగ్ కోసం న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు ఆ టైంలో మరొక కథ కూడా చెప్పాడు. ఏది చేసినా కూడా తనకు ఓకే అని నేను అన్నాను. ఇక నువ్వే నువ్వే సినిమా షూటింగ్ మొదలయ్యే కొన్ని రోజుల క్రితమే నువ్వు నాకు నచ్చావు విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకి రైటర్ గా వర్క్ చేసిన త్రివిక్రమ్ కు అప్పట్లో భారీ స్థాయిలో ఆఫర్లు వచ్చినా కూడా మొదటి సినిమాను స్రవంతి మూవీస్ లోనే చేస్తాను అని అన్నారు.

  అతనితో ట్రావెలింగ్

  అతనితో ట్రావెలింగ్

  నువ్వే నువ్వే సినిమా షూటింగ్ మొదలవడానికి ముందు త్రివిక్రమ్ టాప్ మోస్ట్ రైడర్ గా గుర్తింపును అందుకున్నాడు. చదువులో కూడా నెంబర్ వన్. గోల్డ్ మెడలిస్ట్ కూడా. అయితే అతను సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా గుర్తింపును అందుకోవాలని కలలు కనడం.. ఇక అతని లక్ష్యసాధనలో మేము కూడా ఒక భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అతనితో ట్రావెలింగ్ నాకు ఇప్పటికీ కూడా ఎంతో సంతృప్తిని ఇస్తుంది.. అని స్రవంతి రవి కిషోర్ అన్నారు.

   ఆ సాంగ్ కోసం

  ఆ సాంగ్ కోసం


  ఇక ఈ సినిమా షూటింగ్ విశేషాల గురించి చెబుతూ ఎప్పుడు చూసినా కూడా ఈ సినిమా ఫ్రెష్ గా ఉంటుంది. సినిమాలో సీతారామశాస్త్రి గారు మూడు పాటలు రాశారు. త్రివిక్రమ్ డైలాగులు కూడా అద్భుతంగా ఉన్నాయి. కోటి సంగీతం కూడా మేజర్ ప్లేస్ పాయింట్. ప్రకాష్ రాజు శ్రీయ మధ్యలో వచ్చే సన్నివేశాలు కూడా గొప్పగా ఉంటాయి. అమ్మా.. ఆవకాయ్.. అంజలి ఎప్పుడు బోర్ కొట్టదు.. అనే డైలాగ్ త్రివిక్రమ్ ఒక రోజు రాత్రి ఫోన్ చేసి చెప్పాడు. అలాంటి సంభాషణాలను సార్లు జరిగాయి ఇక ఈ సినిమాలోని సాంగ్స్ లలో ఐ యామ్ వెరీ సారీ అనే పాటను ఊటీలో స్కూల్ లో షూట్ చేయగా దాదాపు 60 లక్షలు ఖర్చు అయింది. ఇంటర్వెల్ గోల్ఫ్ సీన్ తో పాటు బీచ్ సీన్ కూడా ముంబైలో ఒకే టైంలో పూర్తి చేసాము.. అని అన్నారు.

  నువ్వే నువ్వే.. పురస్కారాలు

  నువ్వే నువ్వే.. పురస్కారాలు

  ఇక ఈ సినిమాకు మంచి పురస్కారాలు కూడా దక్కాయి. ముఖ్యంగా నంది అవార్డుల్లో చిత్రం విభాగంలో సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం గా నువ్వే నువ్వే నిలిచింది. ఇక తర్వాత నంది అవార్డులలో వెండి పురస్కారం నిర్మాతకు దక్కింది. అలాగే బెస్ట్ డైలాగ్స్ విభాగంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ నంది అవార్డు అందుకోగా.. ఆ తర్వాత ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాష్ రాజ్ అందుకున్నారు.

  English summary
  20 years of trivikram srinivas first movie nuvve nuvve and producer speech
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X