2000 మంది కొట్టడానికి సిద్ధం.. జగపతి బాబు ఒక్కడే.. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ తెలుసా?
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నారు. 35 ఏళ్లుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటుడిగా యాక్టివ్ గా ఉన్నారు. హీరోగా 90లలో ఎన్నో సినిమాలు చేశారు. తన నటనతో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. అప్పట్లో లవర్ బాయ్ ఇమేజ్ ను కూడా జగపతి బాబు దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు విభిన్న పాత్రలు పోషిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ను మరింత జోరుగా నడిపిస్తున్నారు. ఇదే సమయంలో తనకు వీలైనప్పుడల్లా ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ వస్తున్నారు. కాగా తన కెరీయర్ లో జరిగిన ఓ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ను చెప్పుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
జగపతి బాబు బెస్ట్ మూవీస్..
ఏపీలోని మచిలీపట్నంలో జగపతి బాబు 1962 ఫిబ్రవరి 12న జన్మించారు. ఆయన తండ్రి బి రాజేంద్ర ప్రసాద్ నిర్మాత కావడం విశేషం. చెన్నైలో ఇక 15 ఏళ్లకే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. తొలుత జగపతి బాబు 1989లో సింహ స్వప్నం అనే చిత్రంతో హీరోగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రాన్ని తన తండ్రి ప్రొడ్యూస్ చేయడం విశేషం. ఆ తర్వాత అడివిలో అభిమన్యుడు, పెద్దరికం, గాయం, శుభలగ్నం, మావిచిగురు, శుభాకాంక్షలు, పెళ్లిపందిరి, అంతఃపురం, మనోహరం, అతడే ఒక సైన్యం, పెద్దబాబు, పెళ్లైన కొత్తలో వంటి గుర్తుండిపోయే చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులను అందుకున్నారు. మరోవైపు తమిళం, కన్నడ, భాషల్లోనూ నటింటిచారు.

2000 మందికి ఎదురు నిలిచి..
జగపతి బాబు తనకు సమయం ఉన్నప్పుడల్లా ఇంటర్వ్యూలు ఇస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా తనకు రియల్ లైఫ్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చారు. అయితే ఒక కాలేజీ ఈవెంట్ కు వెళినప్పుడు అక్కడ వేదికపై తనను మాట్లాడొద్దని చెప్పారంట. అందుకు కారణం కులం అని ఆయనికి తెలిపారు. మీరు ఏదైనా మాట్లాడితే 2000 మంది మిమ్మల్ని చితకబాదుతారని హెచ్చరించారంట. దాంతో జగపతి బాబుకు కోపం వచ్చి మైక్ తీసుకుని స్టూడెంట్స్ తో మాట్లాడరంట. మీకు కుల గొడవలు ఎందుకు అని ప్రశ్నించారంట. అందరు మనుషులేనని, కుల గొడవలకు వెళ్లొద్దని చెప్పారంట. చాలా సేపు వేదికపై మాట్లాడిన ఎవ్వరూ ఎలాంటి గొడవ చేయలేదని చెప్పారు. అలాంటి సెన్సీటివ్ ఇష్యూస్ ను కూడా డీల్ చేసిన అనుభవం ఉందని చెప్పుకొచ్చారు. ఇక జగపతి బాబు ఏ అంశమైనా ఇలాగే ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్ములేపుతూ..
ప్రస్తుతం జగపతి బాబు ఆయన కెరీయర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. లెజెండ్ నుంచి విలన్ పాత్రలు, సపోర్టింగ్ పాత్రలు, ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు. కరెంట్ తీగ, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, గూఢాచారి, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, అఖండ, రాధే శ్యామ్, గుంటూరు కారం, సలార్, పుష్ప 2 వంటి చిత్రాల్లో నటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు.
జగపతి బాబు రాబోయే చిత్రాలు..
చివరిగా తెలుగులో గుంటూరు కారం, ది ఫ్యామిలీ స్టార్, మిస్టర్ బచ్చన్, పుష్ప 2 వంటి చిత్రాలతో అలరించారు. మరోవైపు హిందీలో జాట్ అనే చిత్రంలో అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక నెక్ట్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న పెద్ది చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.


Click it and Unblock the Notifications











