హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఎన్టీఆర్, ప్రభాస్, మంచు మనోజ్.. వెరీ వెరీ స్పెషల్
ఈ లోకం కొత్త సంవత్సంరలోకి అడుగుపెట్టింది. ఆనందోత్సాహాలు, యువలకుల కేరింతల నడుమ ను ఇయర్ 2020 కి వెల్‌కమ్ చెప్పింది యావత్ ప్రజానీకం. ఈ సందర్బంగా ఈ కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపాలని కోరుకుంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్టీఆర్ ట్వీట్
''అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను'' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
ఎంతగానో సపోర్ట్ చేస్తున్న అభిమానులకు మహేష్ మెసేజ్
''ఓ గొప్ప సంవత్సరం 2019లో ఆశీస్సులు అందించిన దేవుడికి ధన్యవాదాలు. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న నా కుటుంబానికి, నాతో ఎప్పుడూ ఉండే నా స్నేహితులకు, అలాగే నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2020'' అని పేర్కొన్నారు మహేష్ బాబు.

కొత్త కలలు, కొత్త ఆశలు
''కొత్త కలలు, కొత్త ఆశలు, కొత్త కోరికలు.. ప్రతి ఒక్కరికీ చేకూరాలని, ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపాలని కోరుకుంటున్నాను'' అని దిల్ రాజు పేర్కొన్నారు.

ఫ్యాన్స్‌కి ప్రభాస్ సందేశం
2020 ప్రతి ఒక్కరీ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్.. అని ప్రభాస్ తెలిపారు.
మోహన్ బాబు ట్వీట్
నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, భోగ భాగ్యాలను షిర్డీ సాయి నాథుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని మోహన్ బాబు పేర్కొన్నారు.
హ్యాపీ న్యూ ఇయర్ 2020
హ్యాపీ న్యూ ఇయర్ 2020. ఈ ఏడాది అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు చేకూరాలని కోరుకుంటున్నాను అని రవితేజ సందేశం పోస్ట్ చేశారు.
జీవితాలు వెలుగులమయం కావాలి
ఎంతో అద్భుతమైన 2020 ఏడాదిలో అందరి జీవితాలు వెలుగులమయం కావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అని నాగార్జున తెలిపారు.
సంతోషాన్ని పంచండి, ద్వేషాన్ని కాదు
‘హ్యాపీ న్యూ ఇయర్. లవ్ యూ ఆల్. ఈ ఏడాది అందరికీ అద్భుతంగా ఉండాలని కోరకుంటున్నాను. సంతోషాన్ని పంచండి, ద్వేషాన్ని కాదు' అని మంచు మనోజ్ ట్వీట్ చేశాడు.
అంతా మంచే జరగాలని కోరుకుంటూ
‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు మున్ముందు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను' అని రష్మిక ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











