గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక వాయిదా.. ఆస్కార్ దారిలోనే
కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ సినిమా పరిశ్రమను కుదేలు చేస్తున్నది. సినిమాల విడుదల నుంచి అవార్డు ఫంక్షన్ల వరకు రద్దు కావడం సినీ పరిశ్రమకు ఓ చేదు అనుభవాలను కోవిడ్ పరిస్థితులు మిగులస్తున్నాయి. ఇప్పటికే ఆస్కార్ అవార్డులు కార్యక్రమం వాయిదా పడగా, ఇప్పుడు అంతంటి ప్రేక్షకాదరణ పొందిన గోల్డెన్ గ్లోబ్ అవార్డులు కూడా రద్దు కావడం సినీ ప్రముఖులకు షాకిచ్చింది.
2021 అవార్డుల కార్యక్రమాన్ని ఫిబ్రవరి 28వ తేదీన నిర్వహించాలని కమిటీ నిర్ణయిం తీసుకొన్నది. ఏప్రిల్ 25, 2021న జరిగే ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి ఎనిమిది వారాల ముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ఓ ప్రకటన చేసింది.

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కమిటీ ట్విట్టర్‌లో స్పందించింది. 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమాన్ని ఫిబ్రవరి 28వ తేదీ 2021 ఆదివారం నిర్వహిస్తున్నాం. ఆ వేడుకకు సంబంధించి లైవ్ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుంచి ప్రసారం అవుతుంది. ఈ అవార్డుల కార్యక్రమం కాలిఫోర్నియాలోని బేవెర్లీ హిల్స్‌లోని ది బేవెర్లీ హిల్టన్ వేదికపై జరుగుతాయి అని ట్వీట్‌లో పేర్కొన్నది.
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ఎంపికకు కోసం జరిగే ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తాం. ధానికి సంబంధించిన ఓటింగ్ వివరాలను కూడా మార్గదర్శకాలతో వెల్లడిస్తాం అని కమిటీ చెప్పారు.


Click it and Unblock the Notifications











