2021 Twitter Top movies: పాన్ ఇండియా మూవీ కూడా ఆ హీరోను బీట్ చేయలేదు.. వకీల్ సాబ్ కూడా..
2021 వ సంవత్సరంలో సౌత్ చిత్ర పరిశ్రమ మళ్లీ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయినట్లు అనిపించింది. గత ఏడాది కరోనా దెబ్బకు ఒక్కసారిగా డౌన్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇయర్ స్టార్టింగ్ లోనే మళ్ళీ పరిస్థితులు కొంత నార్మల్ స్టేజ్ కు వచ్చాయి. ఇక 2021లో సోషల్ మీడియా ట్విట్టర్లో ఎక్కువగా ట్వీట్ చేయబడిన సౌత్ సినిమాలు లిస్టులో పాన్ ఇండియా సినిమాల కంటే కూడా లోకల్ సినిమాలో ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకోవడం విశేషం. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరొకసారి తన సత్తా చాటాడు. ఇక ఈ ఏడాది ఎక్కువగా ట్వీట్ చేయబడిన సినిమాల టాప్ టెన్ లిస్ట్ లోకి వెళితే..

యష్ సినిమా టాప్ 10
పదవ స్థానంలో కేజిఎఫ్ చాప్టర్ 2 నిలిచింది. కేజిఎఫ్ చాప్టర్ 1 తో బాక్స్ ఆఫీసు వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న యష్ ఈ ఏడాది సెకండ్ పార్ట్ తో మరో విజయాన్ని అందుకోవాలని అనుకున్నాడు. కానీ కరోనా కారణంగా ఆ సినిమా వాయిదా పడక తప్పలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అప్డేట్స్ ద్వారా కేజిఎఫ్ చాప్టర్ 2 ఎక్కువగానే వైరల్ అయ్యింది. ఎక్కువగా ట్వీట్ చేయబడిన సినిమాలో పేర్లలో కేజిఎఫ్ 2 2021లో పదవ స్థానంలో నిలిచింది.

100కోట్ల ఎఫెక్ట్..
9వ స్థానంలో శివ కార్తికేయన్ డాక్టర్ సినిమా నిలిచింది. ఈ సినిమాకు విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక శివ కార్తికేయన్ తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ చేయడంతో భారీ స్థాయిలో స్పందన వచ్చింది. సినిమా 100 కోట్ల బిజినెస్ చేయడంతో ట్విట్టర్లో కూడా భారీగా వైరల్ అయ్యేది. దీంతో ఎక్కువగా ట్వీట్ చేయబడ్డ సినిమాల్లో ఈ ఏడాది డాక్టర్ సినిమా 9 వ స్థానంలో నిలిచింది.

మహేష్ తరువాత బన్నీ..
ఇక ఎనిమిదవ స్థానంలో పుష్ప సినిమా నిలిచింది. వరుస హిట్స్ తో చిత్రయూనిట్ సోషల్ మీడియాలో కొత్త సినిమాలు బాగానే కలెక్ట్ చేసింది దీంతో ఎక్కువగా ట్వీట్ చేయబడిన సినిమాల్లో పుష్ప టాప్ టెన్ లో నిలిచింది. ఇక 7వ స్థానంలో మహేష్ బాబు సర్కారు వారి పాట నిలవడం విశేషం. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కూడా సర్కారు వారి పాట యాడ్ బాగానే ఉంది.

పవన్ vs RRR
ఇక బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ త్రిబుల్ ఆర్ ఆరవ స్థానంలో నిలవడం విశేషం. ఎక్కువగా సినిమాకు సంబంధించిన సాంగ్స్ ద్వారా సినిమాకి భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇక తెలుగులో ఎక్కువగా ట్వీట్ చేయబడిన సినిమాల్లో వకీల్ సాబ్ సినిమా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో వకీల్ సాబ్ పేరు మారుమ్రోగింది. దీంతో 2021 సౌత్ మోస్ట్ ట్వీటేడ్ మూవీస్ లో 5వ స్థానంలో నిలిచింది.

కోలీవుడ్ స్టార్స్ బిగ్ ఫైట్
ఇక 4వ స్థానంలో సూర్య జై భీమ్ నిలిచింది. అనేక రకాల కాంట్రవర్సీలతో ఈ స్కనిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక విజయ్ బీస్ట్ సినిమా మరోసారి వండర్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ట్యాగ్ భారీ స్థాయిలో ట్రేండింగ్ లిస్టులో చేరింది. ఎక్కువగా సెర్చ్ చేయబడిన సినిమాగా కూడా రికార్డులు సృష్టించింది. ఇక రెండవ స్థానంలో అజిత్ వాలిమై మూవీ నిలిచింది.
Recommended Video

నెంబర్ వన్ లో విజయ్ మూవీ
ఇక మొదటి స్థానంలో విజయ్ మాస్టర్ సినిమా నిలవడం విశేషం. పాన్ ఇండియా సినిమాలు ఉన్నా కూడా ఈ ఏడాది విజయ్ ట్యాగ్ తో పాటు మాస్టర్ పేరు కూడా మ్రోగిపోయింది. విజయ్ స్టార్ హోదా ఏమిటో మరోసారి చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. ఇక తెలుగులో కూడా అతనికి మెల్లగా ఫ్యాన్ ఫాలోవర్స్ పెరుగుతున్నారు. దీంతో 2021 సౌత్ మోస్ట్ ట్వీటేడ్ మూవీస్ లో మాస్టర్ మొదటి స్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications











