twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2021 Comeback heroes: కష్టాల్లోనే సక్సెస్ కొట్టిన హీరోలు.. పవన్ నుంచి గోపిచంద్ వరకు సాలీడ్ కలెక్షన్స్

    |

    ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీలో పై గట్టిగానే చూపించిందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కరోనా కష్ట కాలంలోనే కొందరు హీరోలు మాత్రం కమ్ బ్యాక్ అవ్వడం మరొక ముఖ్యమైన విషయం. సక్సెస్ కోసం ఎదురుచూసే హీరోలు మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే కష్ట కాలంలోనే కరోనా పోటీపడి మరీ బాక్సాఫీస్ ముందు యుద్ధానికి దిగారు. ఇక వారి కష్టానికి తగ్గ ఫలితం కూడా దక్కడం విశేషం. ఒక విధంగా 2020లో సినిమాలను విడుదల చేయకుండా ఆపేసినప్పటికి 2021లో కొంతమంది మాత్రం కాలంతో పోటీ పడి మరీ విజయాన్ని అందుకున్నారు. అందులో ముఖ్యమైన నలుగురు హీరోల సినిమాలపై ప్రత్యేకంగా ఒక లుక్కేస్తే..

     మంచి బూస్ట్ ఇచ్చిన రవితేజ

    మంచి బూస్ట్ ఇచ్చిన రవితేజ

    ఈ ఏడాది అసలు సినిమాలు విడుదల అవుతాయా లేదా అని కంగారు పడుతున్న సమయంలో క్రాక్ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో రవితేజ మొదటి సారి 50 కోట్ల బాక్సాఫీస్ మార్కెట్ ను కూడా సొంతం చేసుకున్నాడు. వరుసగా నాలుగైదు సినిమాల ఫలితాలతో దాదాపు కెరీర్ ముగిసినట్లే అనే కామెంట్స్ కూడా వచ్చాయి. అలాంటి రవి తేజ క్రాక్ సినిమాతో ఒక్కసారిగా బ్యాడ్ సెంటిమెంట్ కు బ్రేక్ చేశాడు.

    తొమ్మిదేళ్ల తరువాత దక్కిన విజయం

    తొమ్మిదేళ్ల తరువాత దక్కిన విజయం

    రవితేజ తరువాత చాలా తొందరగా కమ్ బ్యాక్ ఇచ్చిన మరొక ముఖ్యమైన హీరో అల్లరి నరేష్. అప్పుడెప్పుడో సుడిగాడు సినిమా తో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న అల్లరినరేష్ మళ్లీ తొమ్మిదేళ్ల అనంతరం నాంది సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. మొత్తానికి అల్లరి నరేష్ కూడా ఫామ్ లోకి రావడంతో మిగతా హీరోలు కూడా ధైర్యం చేసి వారి సినిమాలను భారీ స్థాయిలో విడుదల చేశారు.

     ఫామ్ లోకి వచ్చిన పవర్ స్టార్

    ఫామ్ లోకి వచ్చిన పవర్ స్టార్

    ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గత కొంతకాలంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకోలేదు. ఇక ఫైనల్ గా వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ ఫామ్ లోకి వచ్చాడు అని చెప్పవచ్చు. అసలైతే బాక్సాఫీస్ వద్ద ఇంకా ఎక్కువ స్థాయిలో కలెక్షన్లు వచ్చేవి కానీ ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు ఒక్కసారిగా తగ్గించడం అలాగే కరోనా కూడా ఈ సినిమా వసూళ్లపై కాస్త ప్రభావం చూపించాయి. కానీ ఈ సినిమాతో నిర్మాతకు మాత్రం మంచి లాభాలు వచ్చాయి. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ కూడా మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు అని చెప్పవచ్చు.

    Recommended Video

    Seetimaarr Movie Team Vinayaka Chaviti Special Interview
    గోపీచంద్ కూడా హిట్టు కొట్టేశాడు

    గోపీచంద్ కూడా హిట్టు కొట్టేశాడు

    ఇక ఇప్పుడు గోపీచంద్ కూడా సీటీమార్ తో చాలా కాలం తరువాత హిట్ అందుకోవడం సంతోషించాల్సిన విషయం ఎందుకంటే. గోపీచంద్ హిట్ చూసి చాలా కాలం అవుతోంది. గత నాలుగు సినిమాలు కూడా పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వెనక్కి తీసుకు రాలేకపోయాయి. గౌతమ్ నందా, ఆక్సిజన్, పంతం, చాణక్య వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్స్ గా నిలిచాయి. మొత్తానికి ఇప్పుడు సీటీమార్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. మొదటి రోజే మూడు కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక రెండవ రోజు మరికొంత కలెక్షన్స్ పెరగడం విశేషం. ఆదివారం కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి గోపీచంద్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడం పెద్దగా సమస్య కాకపోవచ్చు. బాక్సాఫీసు వద్ద తన మరో 7 కోట్ల షేర్ అందుకోగలిగితే చాలు. ఇక మొత్తానికి గోపీచంద్ చాలా కాలం తర్వాత ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు.

    English summary
    2021 tollywood comeback heroes powerful box office collections,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X