2021లో సత్తా చాటిన టాప్ వెబ్ సీరీస్‌లు.. స్క్విడ్ గేమ్స్, మనీ హీస్ట్‌తోపాటు ఇంకా ఏమున్నాయంటే..

లాక్‌డౌన్ కారణంగా ఓవర్ ది టాప్ (ఓటీటీ)కి ప్రేక్షకులు మరింత చేరువయ్యారు. 2021 సంవత్సరం ఓటీటీ నామ సంవత్సరంగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. అంతగా ఓటీటీ ఛానెల్స్‌తో ప్రేక్షకులు తమ అనుబంధాన్ని పెంచుకొన్నాయి. దేశీయ ఓటీటీ ఛానెల్స్‌తోపాటు విదేశీ ఓటీటీ సంస్థలు ఆడియెన్స్ నాణ్యమైన, ఉన్నత కంటెంటె విలువులు ఉన్న షోలను అందించాయి. దాంతో ఓటీటీలో వచ్చిన సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు అనూహ్యమైన స్పందన లభించింది. ఓటీటీలో టాప్‌గా నిలిచిన కొన్ని షోలు, వెబ్ సిరీస్‌ల జాబితా ఇదే..

2021లో మోస్ట్ సక్సెస్‌పుల్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్.. దక్షిణ కోరియాకు చెందిన ఈ సర్వైవల్ డ్రామా సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకొన్నది. 45.6 బిలియన్ డాలర్ల కోసం 456 ప్లేయర్లు ఆడే గేమ్‌ ఆద్యంత ఆకట్టుకొంటుంది. రెడ్ లైట్, గ్రీన్ లైట్, టగ్ ఆఫ్ వార్, మార్బుల్ లాంటి పేర్ల కూడిన ఈ సిరీస్ చిన్నారుల నుంచి వృద్దుల దాకా ఆకర్షించింది. ఈ సిరీస్‌ను కోట్లాది మంది చూడటం ఓ రికార్డుగా మారింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది.

2021 years Top OTT Web serieses: Squid Game, Money Heist, Loki, Lupin got good response in OTT

ప్రస్తుత ఏడాది రెండోస్థానంలో నిలిచిన వెబ్ సిరీస్ మనీ హీస్ట్. స్పానిష్ క్రైమా డ్రామా ఆద్యంత ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసింది. టోక్యో, లిబ్సన్, రియో, స్టాక్ హోమ్, నైరోబీ, పాలెర్మో లాంటి నగరాలను దోచుకొనే ముఠాకు ది ప్రొఫెసర్ క్యారెక్టర్ బాస్‌గా ఉంటాడు. ఈ వెబ్ సిరీస్ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

హాలీవుడ్ నటుడు టాడ్ హిడిల్‌స్టోన్ నటించిన లోకి వెబ్ సిరీస్ మూడోస్థానంలో నిలిచింది. ఈ సిరీస్‌కు సంబంధించిన మ్యూజిక్, విజువల్స్, నటీనటుల ఫెర్ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకొన్నాయి. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుత ఏడాదిలో అత్యధిక మంది వీక్షించిన సిరీస్‌గా రికార్డులకెక్కింది.

ప్రస్తుత ఏడాది విశేషంగా ఆకర్షించిన మరో వెబ్ సిరీస్ ఫ్రెండ్స్: రీ యూనియన్. ఈ సిరీస్‌లో జెన్నిఫర్ అనిస్టన్, కౌర్ట్నీ కాక్స్, లిసా కుడ్రోవ్, మాట్ లెబ్లాంక్, మ్యాథ్యూ పెర్రీ, డెవిడ్ స్విమ్మర్ నటించారు. ఈ వెబ్ సిరీస్ హెచ్‌బీవో మ్యాక్స్, జీ5లో ప్రసారం అవుతున్నది.

ఫ్రెంచ్ భాషలో రూపొందిన థ్రిల్లర్ సిరీస్ లుపిన్. ఫ్రెంచ్ నటుడు ఓమర్ సై అద్భుతంగా నటించాడు. నిజాయితీతో కూడిన దొంగగా అసానే డిప్ అనే పాత్రలో కనిపించాడు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X