ఈ వారం థియేటర్లలో ఊహించని ఫైట్.. ఒకేసారి 18 సినిమాల మధ్య పోటీ!

మరి కొన్ని రోజుల్లో పెద్ద సినిమాలు భారీ స్థాయిలో విడుదల కాబోతున్నాయి. అయితే అంతకంటే ముందు చిన్న సినిమాల మధ్య తీవ్ర స్థాయిలో కూడా పోటీ జరగబోతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ నెలలో ఒకేరోజు అత్యధిక సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 10 కంటే ఎక్కువగా ఒకేసారి 18 సినిమాలో డిసెంబర్ 9వ తేదీన విడుదల కాబోతున్నాయి. అయితే ఈ సినిమాల్లో చాలా వరకు కూడా ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు అయితే క్రియేట్ చేయలేదు. రెండు మూడు సినిమాలు తప్పితే మిగతా వాటికి పెద్దగా బస్ కూడా లేదు.

అలాగే మరికొన్ని పాత సినిమాలు కూడా మళ్లీ రీ రిలీజ్ అవుతున్నాయి. ఇక మొత్తంగా ఈ శుక్రవారం ఎన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి అని వివరాల్లోకి వెళితే.. ముందుగా బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన పంచతంత్రం సినిమాపై కొంత ఆసక్తి ఉంది. ఈ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం ఒక విభిన్నమైన ఫీల్ గుడ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ముఖచిత్రం కూడా కొంత హైప్ అయితే క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాలు కూడా ఈ శుక్రవారం రాబోతున్నాయి.

2022 December 9th total 18 tollywood movies release plan ready

ఇక తమన్నా సత్యదేవ్ నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా కూడా శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా ఎంతో కాలంగా వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఇక వీటితోపాటు ప్రేమదేశం, చెప్పాలని ఉంది, లెహరయి నమస్తే సెట్ జి, రాజయోగం, డేంజరస్ అనే మరికొన్ని చిన్న సినిమాలు కూడా అదే రోజు లిమిటెడ్ థియేటర్లలో విడుదల కాబోతున్నాయి.

ఇక మరికొన్ని సినిమాల వివరాల్లోకి వెళితే.. విజయానంద్, ఏపీ 04 రామాపురం, మనమందరం ఒక్కటే, సివిల్ ఇంజనీర్, ఆక్రోషం, ఏయ్ బుజ్జి నీకు నేనే.. అనే మరికొన్ని చిన్న సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ఇక ఈ పోటీలో మరో రెండు పాత సినిమాలు కూడా విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో ఒకప్పటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా మంచి క్రేజ్ అందుకున్న ప్రేమదేశం సినిమా రిలీజ్ చేస్తున్నారు. 1996లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక మరొక గోల్డెన్ క్లాసిక్ మాయాబజార్(1957) కలర్ సినిమా కూడా రీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై కూడా కొంత హైప్ అయితే ఉంది. మరి వీటన్నిటిలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధిక స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X