2022 Sankranti Movies: సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న F3 మూవీ.. న్యూ రిలీక్ డేట్స్ ఫిక్స్!

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే పండగ సీజన్ అనేది చాలా ముఖ్యం. బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ రావాలి అంటే పండగ వాతావరణం లోనే సాధ్యమవుతుంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పొంగల్ ఎంతో ప్రత్యేకమని చెప్పవచ్చు. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా పెట్టిన పెట్టుబడికి తప్పకుండా డబుల్ ప్రాఫిట్స్ అందిస్తాయని నిర్మాతల్లో ఒక బలమైన నమ్మకం అయితే ఉంది. గతంలో చాలా సినిమాలు ఆ విధంగా మంచి లాభాలను కూడా అంధించాయి.

పోటీ ఎక్కువగా ఉంటే మాత్రం కలెక్షన్స్ విషయంలో ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని సినిమాలు పోటీ నుంచి తప్పుకుంటున్నాయి. ఇక సంక్రాంతికి రావాలనుకున్న F3 సినిమా కూడా పోటీ నుంచి ఒక్కసారిగా తప్పుకుంది.

సంక్రాంతిలో బెస్ట్ కలెక్షన్స్

సంక్రాంతిలో బెస్ట్ కలెక్షన్స్

సంక్రాంతి అనగానే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన సందడి నెలకొంటుంది. ఆ సమయంలో పెద్ద సినిమాల్లో చిన్న సినిమాలు అని తేడా లేకుండా ఒకే వారంలో విడుదల అవుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు ఒకే రోజు విడుదల అయితే మరికొన్ని సినిమాలో రెండు మూడు రోజుల గ్యాప్ తీసుకుని విడుదల అవుతూ ఉంటాయి మొత్తంగా మూడు నాలుగు సినిమాలు సంక్రాంతి లో నిలిచిన కూడా మంచి విజయాన్ని అందుకుంటాయని అని చెప్పవచ్చు.

 RRR డేట్ ఫిక్స్

RRR డేట్ ఫిక్స్

2022 సంక్రాంతికి కూడా మంచి ఫుల్ మీల్స్ లాంటి సినిమాలు రాబోతున్నాయి. ముందుగా జనవరి 7న RRR సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ తేజ్ - జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ సాంగ్స్ కూడా మంచి హైప్ క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి. సంక్రాంతి భరిలో సినిమా పైచేయి సాధించే అవకాశం ఉంది.

మహేష్ డౌటే?

మహేష్ డౌటే?

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి సంక్రాంతి టాలీవుడ్ సినిమాలతో చాలా విభిన్నంగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పోటీలో ముందు నుంచి మహేష్ బాబు సర్కారు వారి పాట నిలవబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమాను జనవరి 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ సినిమా అనుకున్న సమయానికి వస్తుందో లేదో చెప్పడం కాస్త కష్టమే. వాయిదా పడే అవకాశం కూడా ఉన్నట్లు ఇటీవల కొన్ని కథనాలు వెలువడ్డాయి. మరి ఆ విషయంలో చిత్రయూనిట్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

రాధేశ్యామ్ vs భీమ్లా నాయక్

రాధేశ్యామ్ vs భీమ్లా నాయక్

పవన్ కళ్యాణ్ రానా - దగ్గుబాటి నటిస్తున్నారు భీమ్లా నాయక్ సినిమా కూడా సంక్రాంతికి రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఎలాగైనా జనవరి 12న విడుదల చేయాలని చిత్ర యూనిట్ బలమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండు మూడు సార్లు అఫిషియల్ గా క్లారిటీ వచ్చేసింది. దీంతో సంక్రాంతి పోటీ మరింత వేడెక్కింది. ఇక రాధేశ్యామ్ సినిమా జనవరి 14న రాబోతున్నట్లు మరొకసారి అధికారికంగా తెలియజేశారు. ఇటీవలటీజర్ కు కూడా భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేసింది.

Recommended Video

DSP Vs Thaman : ఎవరి పారితోషికం ఎక్కువ? Tollywood లో మ్యూజికల్ రేస్ ! || Filmibeat Telugu
పోటీ నుంచి తప్పుకున్న F3

పోటీ నుంచి తప్పుకున్న F3

అయితే ఫైనల్ గా F3 సినిమా కూడా సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుంది. అసలైతే ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయాలనుకున్నారు. లేదా క్రిస్మస్ సందర్భంగా కూడా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సంక్రాంతి బెటర్ అని ఆలోచించారు కానీ పోటీ ఎక్కువ కావడంతో ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మరొకసారి అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X