Don't Miss!
- Finance
Bank Fraud: బయటపడ్డ వేల కోట్ల లోన్ కుంభకోణం.. కంపెనీపై కేసు నమోదు చేసిన సీబీఐ
- News
YS Jagan : నేడు ఢిల్లీకి సీఎం జగన్? ఆ పర్యటనలు రద్దు! అవినాష్ కు సీబీఐ నోటీసులతో!
- Sports
INDvsNZ : తొలి టీ20కి అంతా రెడీ.. వీళ్లే మ్యాచ్ గెలిపిస్తారు!
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
2022లో హిందీలో టాప్ లేపిన టాలీవుడ్ మూవీస్.. ఏ సినిమాకు ఎంత కలెక్షన్లు వచ్చాయంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది కొన్ని సినిమాలు ఊహించని విధంగా మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సాలిడ్ కలెక్షన్స్ పొందడం విశేషం. ముఖ్యంగా కొన్ని చిన్న సినిమాలు కూడా ప్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే మంచి వసూళ్లను సాధించాయి. ఇక 2022లో RRR తో పాటు మిగతా కొన్ని సినిమాల్లో హిందీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నాయి అనే వివరాల్లోకి వెళితే..

RRR హిందీ కలెక్షన్స్
ముందుగా RRR సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా నార్త్ జనాలను కూడా ఎంతగానో అట్రాక్ట్ చేసింది. దర్శకదీరుడు రాజమౌళి బ్రాండ్ మేరకు అక్కడ మంచి బజ్ అయితే పెరిగింది. ఇక మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో మొత్తం ఫుల్ రన్ లో కేవలం హిందీలోనే RRR సినిమా 277 కోట్ల నెట్ కలెక్షన్ సొంతం చేసుకుంది.

కార్తికేయ 2 సాలీడ్ కలెక్షన్స్
ఇక RRR సినిమా తర్వాత హిందీలో మంచి ప్రాఫిట్స్ అందించిన తెలుగు సినిమాలలో కార్తికేయ 2 నిలిచింది. అసలు ఈ సినిమాను మొదట హిందీలో కేవలం కొన్ని లిమిటెడ్ థియేటర్లలోనే విడుదల చేశారు. కానీ రెండవ రోజు నుంచే బాలీవుడ్ సినిమాలతో పోటీపడుతూ కార్తికేయ 2 సాలిడ్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. శ్రీకృష్ణ మిస్టరీ అక్కడ జనాలకు ఎంతగానో నచ్చడంతో మొత్తంగా 34 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.

ప్రభాస్ రాధే శ్యామ్
ఇక ఈ ఏడది మొదట్లో ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా కూడా హిందీ జనాలను ఆకట్టుకోవడానికి భారీ స్థాయిలోనే నార్త్ లో విడుదలయింది. అయితే బాహుబలి సాహో లాంటి సినిమాలతో అక్కడ మంచి క్రేజ్ అందుకున్న ప్రభాస్ ను రాధే శ్యామ్ లో మాత్రం ఆ విధంగా హిందీ ఆడియెన్స్ చూడలేదు. అక్కడ ఈ సినిమా 22.25 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే సొంతం చేసుకుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మించిన విషయం తెలిసిందే.

విజయ్ దేవరకొండ లైగర్
ఇక భారీ అంచనాలతో వచ్చిన మరో తెలుగు సినిమా లైగర్ కూడా హిందీలో భారీగానే విడుదల అయింది. అక్కడ కూడా ప్రమోషన్స్ గట్టిగానే చేయడం వలన ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. కానీ నెగటివ్ టాక్ అందుకోవడం వలన ఈ సినిమా ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేకపోయింది. అయినప్పటికీ కూడా 21 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఒక విధంగా విజయ్ దేవరకొండకు ఇది మంచి నెంబర్ అని చెప్పవచ్చు. తదుపరి సినిమాలకు కూడా ఈ మార్కెట్ ఉపయోగపడుతుంది.

మేజర్, గాడ్ ఫాదర్
ఇక మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమా 13 కోట్ల వసూళ్ళను సొంతం చేసుకుంది. హిందీలో ఈ సినిమాను మొదట తక్కువ థియేటర్లలో విడుదల చేసి ఆ తర్వాత టాక్ ను బట్టి థియేటర్ల సంఖ్యను పెంచుతూ వెళ్లారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా కూడా అక్కడ 10 కోట్ల నెట్ కలెక్షన్ సొంతం చేసుకుంది. ఇక సీతారామం సినిమా 8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ రాబట్టింది.