2022 Upcoming Movies Release Dates: భీమ్లా నాయక్ దెబ్బతో ఎన్ని మార్పులో.. ఏ సినిమా ఎప్పుడంటే?

సాధారణంగా పండగ సీజన్ లో కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయని ఇండస్ట్రీలో చాలామంది ఫెస్టివల్స్ ను ఫోకస్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం సినిమా ప్రపంచంలో విడుదల తేది లపై ఏ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే పెద్ద సినిమాల హడావుడి ఎక్కువ కావడంతో చిన్న సినిమాలకు పండగ సీజన్ దొరకడమే కష్టంగా మారింది. ఇక పెద్ద సినిమాల మధ్య లో కూడా చర్చలు జరిగిన అనంతరం విడుదల తేదీలను ఫైనల్ చేసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో రాబోయే సినిమాల విడుదల తేదీలలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇక 2022 లో రాబోయే పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ పై ఒక లుక్కేస్తే..

మారిన భీమ్లా నాయక్ డేట్

మారిన భీమ్లా నాయక్ డేట్

సంక్రాంతి అనగానే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక ప్రత్యేకమైన పండగ అనే చెప్పాలి. తప్పకుండా ఈ సీజన్లో ఎలాంటి సినిమా విడుదలైన కూడా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ఉంటాయి. కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా కూడా సినిమా కలెక్షన్స్ ఊహలకందని రేంజ్ లో ఉంటాయి. ఫ్యామిలీ కలిసి చూసే సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక మొత్తానికి సంక్రాంతి బరిలో నుంచి భీమ్లా నాయక్ సినిమా అయితే తప్పుకుంది. ఆ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలియజేశారు.

RRR - రాధేశ్యామ్..

RRR - రాధేశ్యామ్..

పవన్ కళ్యాణ్ సినిమా సంక్రాంతి నుంచి తప్పుకోవడంతో RRR రాధేశ్యామ్ సినిమాలకు కాస్త పోటీ తగ్గిందనే చెప్పాలి. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ కు తగ్గట్టుగా భారీ స్థాయిలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. జనవరి 7వ తేదీన RRR సినిమా విడుదల అవుతుండగా.. జనవరి 14 వ తేదీన రాధేశ్యామ్ సినిమా అదే స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక వీరి మధ్యలో రావాలని అనుకున్న భీమ్లా నాయక్ ఫిబ్రవరిలోకి షిఫ్ట్ అయింది.

సంక్రాంతికి బంగార్రాజు.. ?

సంక్రాంతికి బంగార్రాజు.. ?

అక్కినేని నాగార్జున కూడా సంక్రాంతి సెంటిమెంట్ ను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడు. సోగ్గాడే చిన్నినాయన సినిమా కూడా అప్పట్లో సంక్రాంతికి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా వస్తున్నా బంగార్రాజు సినిమాను కూడా సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీన లేదా జనవరి 21వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఆచార్య.. అదే డేట్..

ఆచార్య.. అదే డేట్..

మెగాస్టార్ ఆచార్య సినిమా విడుదల తేదీ విషయంలో కూడా ఇటీవల అనేక రకాల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ సినిమా వాయిదా పడుతుందా లేదా అనే విషయంలో చిత్రయూనిట్ ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం అయితే ఆచార్య సినిమా ఫిబ్రవరి 4వ తేదీన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన రాబోతున్నట్లు అఫీషియల్గా క్లారిటీ చేశారు.

F3 కొత్త డేట్..

F3 కొత్త డేట్..

ఇక వెంకటేష్ వరుణ్ తేజ్ నటించిన F3 సినిమా ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ దిల్ రాజు భీమ్లా నాయక్ విడుదల అవుతోంది కాబట్టి వారి సినిమాను పోటీ నుంచి తప్పించాడు. ఫైనల్ గా F3 సినిమా మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ఏప్రిల్ 30వ తేదీన విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Recommended Video

Latest Tollywood Updates : ఆ రికార్డుల కోసం బాబాయ్, అబ్బాయ్ రెడీ! || Filmibeat Telugu
సర్కారు వారి పాట.. KGF..

సర్కారు వారి పాట.. KGF..

అయితే అంతకంటే ముందు ఏప్రిల్ 14వ తేదీన KGF 2 తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్ 1వ తేదీన సర్కారు వారి పాట ప్రేక్షకుల ముందుకు రానుంది. సర్కారు వారి పాట విషయంలో ప్రస్తుతం అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఆ సినిమా అనుకున్న సమయానికి రాబోతున్నట్లు దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X