2023 Sankranthi Movies: సంక్రాంతి బరిలో మెగా 154.. మొత్తం ఎన్ని సినిమాలు రాబోతున్నాయంటే?

మరోసారి సంక్రాంతికి అతిపెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి అనగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన పండగ వాతావరణం నెలకొంటుంది అని చెప్పాలి. ఆ సమయంలో ఏ సినిమా వచ్చిన మినిమం కలెక్షన్స్ అందుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుతూ ఉంటాయి. అందుకే అందరూ పొంగల్ ఫెస్టివల్ ను టార్గెట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మెగాస్టార్ 154వ సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధం అయింది. ఈ పోటీలో మొత్తం ఎన్ని సినిమాలు ఉన్నాయి అని వివరాల్లోకి వెళితే..

టైటిల్ అదే

టైటిల్ అదే


మెగాస్టార్ చిరంజీవి నటించిన 154 సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ పై ఇంకా అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. కానీ దాదాపు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీపై గత కొంత కాలంగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

 కలుద్దాం సంక్రాంతికి..

కలుద్దాం సంక్రాంతికి..

ఫైనల్ గా నేడు ఈ సినిమా సంక్రాంతికి రాబోతున్న ఒక ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేశారు. కలుద్దాం సంక్రాంతికి.. అంటూ స్టార్ మెగా స్టార్ కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా త్వరలోనే అఫీషియల్ టైటిల్ అలాగే టీజర్ కూడా విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు.

ప్రభాస్ ఆదిపురష్ పక్కా..

ప్రభాస్ ఆదిపురష్ పక్కా..


2023 సంక్రాంతికి ప్రభాస్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అసలే బాక్సాఫీస్ వద్ద వరుసగా దారుణమైన ఫలితాలతో సతమతమవుతున్న ప్రభాస్ ఈ సారి ఆదిపురుష్ సినిమాతో పండుగ వాతావరణాన్ని ఉపయోగించుకుని సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా సంక్రాంతికి వస్తుందని ఇదివరకే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

విజయ్ వారసుడు

విజయ్ వారసుడు

అయితే మరొక వైపు విజయ్ నటించిన వారసుడు సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇదివరకే ఒక వివరణ ఇచ్చారు. రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాను తెలుగులో విజయ్ భారీస్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి పోటీ ఎంత ఉన్నా కూడా సంక్రాంతికి వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసే ఛాన్స్ అయితే ఉంది.

Recommended Video

Sammathame,Chor Bazaar Movie Review | Kiran Abbavaram | Akash Puri *Reviews |FilmiBeat Telugu
వైష్ణవ్ కూడా..

వైష్ణవ్ కూడా..


అలాగే మరొకవైపు మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా సంక్రాంతి బరిలోకి రాబోతున్నట్లు ఇటీవల ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. వైష్ణవ్ తేజ్ నాలుగవ సినిమా త్రివిక్రమ్ సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక గురువారం విడుదల చేసిన ఒక ప్రత్యేకమైన మోషన్ పోస్టర్ ద్వారా ఈ సినిమా సంక్రాంతికి రాబోతున్నట్లు వివరణ ఇచ్చారు. కుదిరితే వైష్ణవ్ సినిమా వాయిదా పడవచ్చు అని టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో ఎవరు నెంబర్ వన్ స్థానంలో నిలుస్తారో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X